'టెంపర్' ఇండస్ట్రీని షేక్ చేస్తుందా?
on Dec 3, 2014
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వున్న మంచి నటులలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. ఏ పాత్రనైనా అవలీలగా చేయగల సత్తా ఆయన సొంతం. అయితే అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుగా తయారైంది ఎన్టీఆర్ కెరీర్. మంచి పెర్ఫార్మర్ అయినా మంచి సినిమా పడడం లేదు. అది ఎందుకో ఎవరికీ అర్థం కానీ పరిస్థితి. అయితే ఈసారి ఎలాగైనా పూరీ జగన్నాథ్ సినిమాతో హిట్ కొట్టాలని భావిస్తున్నాడట ఎన్టీఆర్. రీసెంట్ గా వచ్చిన 'టెంపర్' ఫస్ట్ లుక్ కూడా ఈ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది. టైటిల్, ఎన్టీఆర్ గెటప్ ఎలా ఎంత టెంపర్‌గా ఉన్నాయో, దానికన్నా డబల్‌కి డబల్ ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్‌లో టెంపర్ నింపాడట డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈ సినిమా ఇండస్ట్రీ షేకింగ్ హిట్ అవడం గ్యారంటీ అనే న్యూస్ కూడా ఇండస్ట్రీ వర్గాలలో నానుతుంది. మరి ఈ సినిమా అయిన నందమూరి అభిమానుల అంచనాలను నెరవేరుస్తుందో లేదో తెలుసుకోవాలంటే, రిలీజ్ వరకు ఆగాల్సిందే!