రజనీకాంత్ లాగా బాలీవుడ్ స్టార్స్ ఉండలేరు..కాకపోతే రజనీని కలవలేదు
on Apr 2, 2025
తమిళ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth)కి ఉన్నక్రేజ్ ఏ పాటిదో తెలిసిందే.నాలుగు దశాబ్దాల నుంచి ఆ క్రేజ్ లో ఎలాంటి మార్పు లేకుండా కొనసాగుతు వస్తుంది.ఇప్పటికీ సినిమా సినిమాకి క్రేజ్ పెరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు.'జైలర్' చిత్రమే అందుకు ఉదాహరణ.గత ఏడాది వేట్టయ్యన్'తో ప్రేక్షకులని అలరించిన రజనీ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో 'కూలి మూవీ చేస్తున్నాడు.ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ మూవీపై హైప్ పెంచేసింది.
రీసెంట్ గా రజనీ గురించి బాలీవుడ్ నటుడు ముకేశ్ ఖన్నా(Mukesh Khanna)మాట్లాడుతు బాలీవుడ్(Bollywood)లో ఉన్న ఎంతో మంది హీరోల కంటే రజనీకాంత్ చాలా గొప్ప వ్యక్తి .ఆయన సినిమాల్లోనే మాత్రమే మేకప్,విగ్గు పెట్టుకుంటాడు.కానీ బయటకి వెళ్ళినప్పుడు ఆ రెండు ఉండవు.అభిమానులని కలవడానికి వచ్చినప్పుడు కూడా సెలబ్రిటీలా కాకుండా సామాన్యమైన వ్యక్తిలా ఉంటాడు.ఈ విషయంలో రజనీ కాంత్ లా బాలీవుడ్ స్టార్స్ ఎవరు ఉండలేరు.అసలు ముంబైలో వాళ్ళు మేకప్ లేకుండా తిరగలేరు.అందుకే ఆయన రియల్ స్టార్.ఇప్పటి వరకు రజనీ ని వ్యక్తిగతంగా కలవలేదని చెప్పుకొచ్చాడు.
ముకేశ్ ఖన్నా 1988 నుంచి 1990 దాకా దూరదర్శన్ లో ప్రసారమైన మహాభారతం(Mahabharatham)సీరియల్ లో భీష్మ పితామహుడు క్యారక్టర్ లో చేసి అశేష ప్రేక్షకుల అభిమానాన్ని పొందాడు.50 హిందీ చిత్రాలు,30 సీరియళ్లు చేసిన ముకేశ్ ఖన్నా'శక్తిమాన్' ద్వారా కూడా ఎంతో మంది అభిమానులని సంపాదించాడు.రజనీకాంత్ సినిమాల్లో తప్ప బయట మేకప్ గాని విగ్ కానీ పెట్టుకోకుండా చాలా సింపుల్ గా ఉంటాడన్న విషయం తెలిసిందే.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
