పెళ్లి కాకపోయినా పర్లేదు.. పిల్లలను కనాలని ఉంది!
on Sep 14, 2022
'సీతా రామం' చిత్రంలో సీతామహాలక్ష్మి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకుల మనస్సులను గెలుచుకుంది మృణాల్ ఠాకూర్. ఆమె చీరకట్టుకి, అందం,అభినయానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అయితే ఆమె ఆఫ్ స్క్రీన్ లో మాత్రం సీత పాత్రకి పూర్తి భిన్నంగా బోల్డ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో ఆమె ఫోటోలను చూసి ఈమేనా సీత పాత్రలో నటించింది అని షాకైన వారు కూడా ఉన్నారు. ఇక రీసెంట్ గా ఆమె పెళ్లి, పిల్లల గురించి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.
ఈ సమాజం మహిళల జీవితాలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తుందని.. పెళ్లి, వయసు, సంతానం అంటూ అనేక ప్రశ్నలు వేస్తారని మృణాల్ వ్యాఖ్యానించింది. తనకు ప్రేమలో పడటం ఇష్టం లేదని.. కానీ తనను, తన వృత్తిని అర్థం చేసుకునే లైఫ్ పార్టనర్ కావాలని భావిస్తున్నట్లు తెలిపింది. మన చుట్టూ చాలా అభద్రతాభావం ఉందని, కాబట్టి తనకు సురక్షితమైన వ్యక్తి కావాలని.. కానీ అలాంటి వాళ్ళు దొరకడం చాలా అరుదు అని కామెంట్స్ చేసింది. అలాగే పెళ్లి కాకపోయినా పర్వాలేదు కానీ పిల్లలను కని తల్లి కావాలనుందని మృణాల్ చెప్పుకొచ్చింది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
