బన్నీతో 'ఒకే ఒకే జీవితం' దర్శకుడి ఫాంటసీ ఫిల్మ్!
on Sep 14, 2022
'ఒకే ఒకే జీవితం' చిత్రంతో దర్శకుడిగా టాలీవుడ్ కి పరిచయమైన శ్రీకార్తీక్ మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం 'ఒకే ఒకే జీవితం' చిత్రానికి వస్తున్న స్పందన పట్ల సంతోషంగా ఉన్న కార్తీక్.. తనకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయాలని ఉందని మనసులో మాట బయటపెట్టాడు.
తాను ఫిల్మ్ మేకర్ అవుతానని తన తల్లికి తెలియదని కార్తీక్ అన్నాడు. తాను షార్ట్ ఫిలిమ్స్ చేసే టైంకే ఆమె కోమాలో ఉన్నారని, అందుకే కాలం వెనక్కి వెళ్తే బాగుండేదనుకునేవాడినని, ఆ ఆలోచన నుంచే 'ఒకే ఒకే జీవితం' కథ పుట్టిందని తెలిపాడు. ఈ సినిమా పట్ల ప్రేక్షకులు, సినీ ప్రముఖుల నుంచి వస్తున్న స్పందన చూసి ఆనందంగా ఉందని చెప్పాడు.
తన తదుపరి చిత్రాన్ని తెలుగులోనే, భారీస్థాయిలో థియేటర్ ఎక్స్పీరియన్స్ పంచే సినిమా చేస్తానని కార్తీక్ అన్నాడు. అలాగే తనకు అల్లు అర్జున్ తో సినిమా చేయాలని ఉందని తెలిపాడు. ఆయనకు తన దగ్గర ఉన్న ఓ ఫాంటసీ కథను వినిపిస్తానని, ఆయనతో సినిమా చేయడానికి ఐదేళ్లు వెయిట్ చేయడానికైనా సిద్ధమనేనని అన్నాడు. మరి బన్నీతో సినిమా చేయాలనే కార్తీక్ కోరిక నెరవేరుతుందేమో చూద్దాం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
