హిట్ దిశగా 'ఒకే ఒక జీవితం'.. కానీ తెలుగులో నష్టాలు తప్పవా?
on Sep 14, 2022
వరుసగా ఆరు పరాజయాల తర్వాత యంగ్ హీరో శర్వానంద్ కి 'ఒకే ఒక జీవితం' రూపంలో ఊరట లభించింది. సెప్టెంబర్ 9న విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ మూవీ ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశముంది కానీ, తెలుగులో స్వల్ప నష్టాలు తప్పవేమోనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో రూ.6.50 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన 'ఒకే ఒక జీవితం'.. మొదటిరోజు 75 లక్షల షేర్, రెండోరోజు రూ.1.10 కోట్ల షేర్, మూడో రోజు రూ.1.37 కోట్ల షేర్, నాలుగో రోజు రూ.62 లక్షల షేర్, ఐదో రోజు రూ.48 లక్షల షేర్ కలెక్ట్ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి ఐదు రోజుల్లో రోజుల్లో రూ.4.32 కోట్ల షేర్ రాబట్టింది. ఇప్పటిదాకా నైజాంలో 2.20 కోట్ల షేర్(బిజినెస్ 2.5 కోట్లు), సీడెడ్ లో 34 లక్షల షేర్(బిజినెస్ 80 లక్షలు), ఆంధ్రాలో 1.78 కోట్ల షేర్(బిజినెస్ 3.20 కోట్లు) వసూలు చేసింది. ఈ రెండు రోజుల్లో నైజాంలో బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశముంది. అయితే ఈ శుక్రవారం మూడు చెప్పుకోదగ్గ సినిమాలు('ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి', 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని', 'శాకిని డాకిని') విడుదలవుతుండటంతో సీడెడ్, ఆంధ్రాలో స్వల్ప నష్టాలు తప్పవేమోనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ మౌత్ టాక్ తో నడుస్తున్న 'ఒకే ఒక జీవితం' ఈ వీకెండ్ లో పుంజుకొని అన్ని ఏరియాల్లోనూ లాభాల బాట పడుతుందేమో చూడాలి.
రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ లో మాత్రం మంచి లాభాల దిశగా దూసుకుపోతుంది 'ఒకే ఒక జీవితం'. తమిళనాడులో 80 లక్షల షేర్, కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా 35 లక్షల షేర్, ఓవర్సీస్ లో 1.36 కోట్ల షేర్ కలిపి వరల్డ్ వైడ్ గా ఐదు రోజుల్లో రూ.6.83 కోట్ల షేర్ వసూలు చేసింది. ఓవరాల్ గా రూ.7.50 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ మూవీ మొదటి రోజు రూ.1.40 కోట్ల షేర్, రెండో రోజు రూ.1.70 కోట్ల షేర్, మూడో రోజు రూ.2 కోట్ల షేర్, నాలుగో రోజు 86 లక్షల షేర్, ఐదో రోజు 87 లక్షల షేర్ రాబట్టి.. బ్రేక్ ఈవెన్ కి ఇంకా రూ.1 కోటి దూరంలో ఉంది. మరో రెండు రోజుల్లో ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ సాధించి హిట్ లిస్టులో చేరే ఛాన్స్ ఉంది.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
