"2016" బన్నీ నామ సంవత్సరం
on Dec 15, 2016
మరి కొద్ది రోజుల్లో 2016కి టాటా చెప్పేయబోతున్నాం..మరి ఈ ఏడాదంతా గూగుల్‌లో టాలీవుడ్‌కు సంబంధించి ఎక్కువమంది ఏం వెదికారు. ఏ హీరోయిన్‌ను కన్నార్పకుండా చూశారు. ఏ హీరో సినిమాల్ని రెప్పవాల్చకుండా చూశారు. ఏ స్టార్ హీరోను ప్రతీక్షణం ఫాలో అయ్యారు. ఇలా కొన్ని ఇంట్రెస్టింగ్ లిస్ట్‌ను ప్రముఖ సెర్చింజిన్ గూగుల్ విడుదల చేసింది. 2016 సంవత్సరానికి గానూ మోస్ట్ సెర్చ్‌డ్ టాలీవుడ్ స్టార్ లిస్ట్‌లో అల్లు అర్జున్ టాప్ ప్లేస్‌లో నిలిచాడు. ఈ సంవత్సరం బన్నీ నటించిన "సరైనోడు" బ్లాక్ బస్టర్ కావడంతో చాలా మంది దానికి సంబంధించే గూగుల్‌లో వెతికారు. బన్నీకి కేవలం తెలుగులోనే కాక తమిళం, మళయాళంలోనూ ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక సోషల్ మీడియాలోనూ బన్నీ చేసే రచ్చ రచ్చ అంతా ఇంతా కాదు.
అల్లు అర్జున్ తర్వాతి స్థానంలో మహేశ్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ నిలిచారు. ముఖ్యంగా అమెరికా, కెనడా, పాకిస్థాన్, యూరప్‌లలో టాప్ సెర్చింగ్‌లో బన్నీ ఉన్నాడు. ఇక రెండవ స్థానంలో ఉన్న మహేశ్ సంగతి చూస్తే "శ్రీమంతుడు" గురించి, మురగదాస్‌తో ప్రిన్స్ మూవీ అప్‌డేట్స్ గురించి తెగ వెతికారు. బాహుబలితో ఇంటర్నేషనల్ స్టార్‌గా గుర్తింపు పొందిన ప్రభాస్ వార్తలపై జనం ఎక్కువ ఫోకస్ చేశారు. ప్రముఖంగా ప్రభాస్ పెళ్లి, మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో ప్రభాస్ మైనపు విగ్రహాం తదితర విషయాలపై సెర్చ్ చేశారు.
జూనియర్ ఎన్టీఆర్ ఈ ఏడాది నటించిన నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ చిత్రాలు బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించడంతో ఈ హీరోకు భారీ ఫాలోయింగ్ పెరిగింది. జనతా గ్యారేజ్ మళయాళంలోనూ విడుదలకావడంతో అక్కడి ఆడియన్స్ కూడా ఎన్టీఆర్‌కి అభిమానులుగా మారిపోయారు. దీంతో ఎన్టీఆర్ ఈ ఏడాది వార్తల్లో వ్యక్తి అయ్యాడు. మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ ఫస్టాఫ్‌లో స్లో అయినా ఇయర్ ఎండింగ్‌లో ఆడియన్స్ టార్గెట్‌గా మారాడు..చెర్రీ హీరోగా నటించిన ధృవ రీసెంట్‌గా రిలీజ్‌కావడంతో ఆ సినిమా విషయాల గురించి తెలుసుకోవడానికి జనం గూగుల్‌లో తెగ వెతికారు..ముఖ్యంగా రష్యన్లు మనోడిపై కాన్సన్‌ట్రేషన్ చేశారు.