స్కెచ్ అదిరింది..కానీ వర్కవుట్ కష్టమే..?
on Dec 15, 2016

మనసుకు నచ్చిన సినిమాలు చేస్తూ తన దారిన తాను సినిమాలు తీసుకుంటూ పోతాడు కళ్యాణ్‌రామ్. అయితే ఇటీవల కళ్యాణ్‌రాం టైం అస్సలు బాగోలేదు.. రవితేజతో తీసిన కిక్-2 డిజాస్టరవ్వగా, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కళ్యాణ్‌రాం నటించిన ఇజం కూడా నష్టాలనే మిగిల్చింది. దీంతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయాడు కళ్యాణ్‌రాం..అన్నను కష్టాల నుంచి గట్టెక్కించాలనుకున్న జూనియర్ ఎన్టీఆర్ తన నెక్ట్స్ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్‌పై బ్యానర్‌పై చేయాలని డిసైడ్ అయ్యాడు. ఎన్టీఆర్ లాంటి స్టార్‌తో సినిమా అంటే మామూలు విషయం కాదు..ఎట్లా లేదన్నా కనీసం 50 కోట్లు ఖర్చు పెడితే గానీ అవుట్ పుట్ బయటకు రాదు.
అసలే నష్టాల్లో ఉన్న కళ్యాణ్‌రాంకు ఇది కత్తిమీద సాము లాంటిదే..ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ అన్నకు సపోర్ట్‌గా మరో పెద్దనిర్మాతను భాగస్వామిగా తీసుకోవాలని అనుకున్నాడు..ఇందుకోసం తనకు తెలిసిన పెద్ద నిర్మాతలను అడిగి చూశాడు. కానీ ఇక్కడే కథ అడ్డం తిరిగింది. తాము సింగిల్‌గా జూనియర్ సినిమాకు ప్రొడ్యూస్ చేస్తాం కానీ పార్ట్‌నర్‌షిప్ మావల్ల కాదంటూ చేతులేత్తేయడంతో అన్నదమ్ములకు షాక్ తగిలినట్లైందట. ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలో తెలియక బ్రదర్స్ తలలు పట్టుకుంటున్నారట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



