బేతాళుడు బిచ్చగాడయ్యాడు..!
on Dec 15, 2016
నకిలీ, డాక్టర్ సలీం చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ సంగీత దర్శకుడు కమ్ హీరో విజయ్ అంటోనీ ఈ సంవత్సరం బిచ్చగాడు సినిమాతో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు..ఎలాంటి అంచనాలు లేకుండా రూ.35 లక్షల చిన్న బడ్జెట్‌తో తెలుగులో రిలీజైన ఈ సినిమా రూ.30 కోట్ల షేర్ రాబట్టింది..అంతేనా 50 రోజుల పోస్టర్ కార్డ్ పడటమే కష్టమైపోయిన ఈ రోజుల్లో 100 రోజులు సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకుంది..దీంతో తమిళ అగ్రహీరోలు రజనీకాంత్, కమల్‌హాసన్, సూర్యల తర్వాత అంతటి మార్కెట్ ఉన్న హీరోగా రాత్రికి రాత్రి నేమ్ కొట్టేశాడు విజయ్.
ఈ క్రమంలో విజయ్ ఆంటోనీ తదుపరి చిత్రం "బేతాళుడి"కి ఎక్కడా లేని క్రేజ్ ఏర్పడింది..దీనికి తోడు ముందుగా రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్‌లకు మంచి స్పందన వచ్చింది..ఇంకేముంది బయ్యర్లు పోటీపడి మరీ బేతాళుడిని కొనుక్కున్నారు. అయితే టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు..విడుదలైన గంట నుంచే అన్ని ఏరియాల నుంచి నెగెటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. లాంగ్ వీకెండ్‌లో 3 కోట్లు కలెక్ట్ చేసిన బేతాళుడికి జనం నుంచి ఆదరణ తగ్గిపోయింది. ఈ మూవీకి పోటీగా బరిలోకి దిగిన మోహన్‌లాల్ "మన్యంపులి"కి పాజిటివ్ రిపోర్ట్ రావడం..ఆ తర్వాత "ధృవ" రిలీజ్ అవ్వడంతో బేతాళుడిని చాలా థియేటర్ల నుంచి తీసేయాల్సి వచ్చింది. అయితే తమిళ డబ్బింగ్ సినిమాకు మూడు కోట్ల షేర్ రావడం అంటే చిన్న విషయం కాదంటున్నారు ట్రేడ్ నిపుణులు.