ప్రియాంకా చోప్రాకు బంగారు గాజు తొడిగిన మోహన్ బాబు..!
on Apr 13, 2016

ఇటు బాలీవుడ్ లోనూ, అటు హాలీవుడ్ లోనూ దూసుకెళ్తున్న ప్రియాంక చోప్రా, తాజాగా పద్మశ్రీ అందుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమెకు సుబ్బిరామిరెడ్డి చిన్న సత్కారాన్ని ఏర్పాటు చేశారు. టిఎస్ఆర్ ఫౌండేషన్ పేరుతో, సాంస్కృతిక కళారంగాల్లో ప్రముఖుల్ని గుర్తించడం సుబ్బిరామిరెడ్డికి ఆనవాయితీగా వస్తోంది. ఢిల్లీలోని ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన ఈ కార్యక్రమానికి సుబ్బిరామిరెడ్డితోపాటు ఆయన కూతురు పింకీరెడ్డి, నటుడు మోహన్ బాబు, శత్రుఘ్నసిన్హా హాజరయ్యారు. మోహన్ బాబు స్వయంగా ప్రియాంకకు గాజును అలంకరించారు. ప్రియాంకను ప్రపంచనటి అంటూ సుబ్బిరామిరెడ్డి ప్రశంసించడం విశేషం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



