చిరు 150లో అనుష్క చేరుతోందా..?
on Apr 13, 2016

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా గురించి ఏదైనా అప్ డేట్ వచ్చిందంటే శరవేగంగా స్ప్రెడ్ అయిపోతోంది. చాలా కాలం తర్వాత చిరు చేస్తున్న సినిమా కాబట్టి, ఆటోమేటిగ్గా ఈ మాత్రం అంచనాలు వస్తాయి లెండి. చిరు పక్కన హీరోయిన్ గా ఎవరైతే బాగుంటుందా అని చాలా ఆలోచించారట మూవీ టీం. సీనియర్ హీరోలతో నటించి, పూర్తి స్థాయి సీనియర్ హీరోయిన్ గా మారిపోయిన నయనతార అయితే, చిరుకు కరెక్ట్ జోడీగా ఉంటుందని మూవీ టీం భావించినా, ప్రస్తుతం నయన ఉన్న ఫామ్ లో ఆమె డిమాండ్ మరీ ఎక్కువగా ఉందని ఫీలౌతున్నారట. అందుకే నాగ్, బాలయ్య పక్కన చేసిన అనుష్కను తీసుకుంటే బాగుంటుందని భావిస్తున్నారట. పైగా ఈ పొడుగు సుందరి ఇప్పటికే చిరుతో స్టాలిన్ లో స్పెషల్ సాంగ్ లో చిందేసింది. వీళ్లిద్దరి జోడీ కూడా బాగానే కుదురుతుంది, పైగా అనుష్కకు ప్రొడ్యూసర్స్ ను ఎక్కువగా ఇబ్బంది పెట్టదు అనే పేరు కూడా ఉంది. మరి చిరు ఎవరికి ఓటేస్తారో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



