ప్రభాస్ పై మనసుపడిన హీరోయిన్..!
on Apr 13, 2016
.jpg)
బాహుబలి ముందు వరకూ ప్రభాస్ కేవలం తెలుగోళ్లకే బాగా తెలుసు. కానీ బాహుబలి రిలీజై ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ అయిన తర్వాత ప్రభాస్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. దాదాపు అన్ని భారతీయ భాషల్లోనూ ప్రభాస్ కు ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఫ్యాన్స్ లో మామూలు వ్యక్తులే కాక, హీరోయిన్లు కూడా ఉండటం విశేషం. తాజాగా ఈ లిస్ట్ లో బ్రిటిష్ మోడల్, ఐ ఫేం అమీ జాక్సన్ చేరింది. తనకు ప్రభాస్ తో కలిసి నటించాలని ఉందంటూ తన మనసులోని కోరికను బయటపెట్టింది. బాహుబలిలో ప్రభాస్ చూసి అతనికి ఫ్యాన్ అయిపోయానని చెబుతోంది. కేవలం అమీ యే కాక, దేశ వ్యాప్తంగా ఎంతో మంది హీరోయిన్స్ ప్రభాస్ సినిమాలో చేయాలనుకోవడం విశేషం. ప్రస్తుతం అమీ జాక్సన్ శంకర్ డైరెక్షన్లో సూపర్ స్టార్ రజనీ సరసన రోబో 2 లో నటిస్తోంది. తెలుగులో ఎవడు సినిమాలో రామ్ చరణ్ సరసన చేసిన అమీ ఆ తర్వాత టాలీవుడ్ డైరెక్ట్ ఫిలిమ్స్ వేటిలోనూ కనబడలేదు. మరి ఫ్యూచర్ లో ఈ పిల్లికళ్ల సుందరికి ప్రభాస్ ఏమైనా ఛాన్స్ ఇస్తాడేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



