ఫిబ్రవరి 18న వస్తున్న 'సన్ ఆఫ్ ఇండియా'
on Feb 2, 2022

కలెక్షన్ కింగ్ డా. మంచు మోహన్‌బాబు హీరోగా డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌తో కలసి విష్ణు మంచు నిర్మించిన సంచలనాత్మక చిత్రం 'సన్ ఆఫ్ ఇండియా'. చిత్రకథానాయకుడు డాక్టర్ మోహన్‌బాబు అదనంగా చిత్రానికి స్క్రీన్‌ప్లే బాధ్యతను కూడా నిర్వర్తించారు. Also read: బాప్‌రే.. "ఊ అంటావా" సాంగ్ కోసం సమంతకు రూ. 5 కోట్లు ఇచ్చారా?
'సన్ ఆఫ్ ఇండియా' చిత్రం డాక్టర్ మోహన్‌బాబు మార్కు డైలాగులు, యాక్షన్ ఎపిసోడ్స్, ఊహించని మలుపులతో అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 18న విడుదల చేస్తున్నట్టు ఈ రోజు (ఫిబ్రవరి 2) మోహన్ బాబు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రకటించారు. Also read: 'చిట్టి'తో షూట్ షురూ చేసిన 'రావణాసుర'!
డా.మోహన్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రంలో శ్రీకాంత్, తనికెళ్ల భరణి, అలీ, వెన్నెల కిషోర్, ఫృథ్వీ రాజ్, రఘుబాబు, రాజా రవీంద్ర, రవిప్రకాష్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఇళయరాజా సంగీతం సమకూర్చారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



