Home

»

Latest News

ఫిబ్ర‌వ‌రి 24న అజిత్ 'వ‌లిమై' వ‌స్తోంది

Feb 2, 2022 2:03PM

 

అజిత్ కుమార్ మొదటి ప్యాన్ ఇండియా గా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న అజిత్‌ 'వలిమై' ప్రపంచ వ్యాప్తంగా హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లో  సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదల కావాల్సింది. కరోనా మహమ్మారి కారణంగా థియేట‌ర్ల స‌మ‌స్య ఎదుర‌వ‌డంతో అప్పుడు వాయిదావేశారు. ఇప్పుడు కాస్త  సానుకూల వాతావరణం ఏర్పడటంతో ఫిబ్రవరి 24న విడుదలకు ప్లాన్ చేశాయి జీ స్టూడియోస్‌, బేవ్యూ ప్రాజెక్ట్స్‌ సంస్థలు. హెచ్. వినోద్  దర్శకత్వంలో బోనీ క‌పూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. Also read: కొత్త రిలీజ్ డేట్స్.. కొంచెం క్లారిటీ, కొంచెం కన్ఫ్యూజన్!

ఈ సంద‌ర్భంగా నిర్మాత బోనీ కపూర్ మాట్లాడుతూ: "తమిళ్ తో పాటు హిందీ, తెలుగు, కన్నడ కూడా ఒకే సారి విడుదల చేస్తున్నాం.  అజిత్ ఫ్యాన్స్ కోరుకున్న విధంగానే  గ్రాండ్ విజువల్స్ తో చిత్రం ఆద్యంతం అల‌రిస్తుంది. తెలుగులో 'ఖాకి'గా విడుదల అయిన కార్తీ తమిళ సినిమా 'థీరన్ అధిగారం ఒండ్రు' సినిమాకు దర్శకత్వం వహించిన హెచ్. వినోద్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అజిత్‌తో ఆయనకు రెండో చిత్రమిది. అజిత్ క్రేజ్ కి తగ్గట్లుగా వినోద్ ఈ చిత్రంలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్, ఛేజింగ్ సీన్లు డిజైన్ చేశారు. ఛేజింగ్ సీన్లు ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా ఉంటాయి.  ఓ  పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా అజిత్ కనిపిస్తాడు. హీరో అజిత్‌కి బైక్స్, బైక్ రైడ్స్ అంటే ఎంత ఇష్టం అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డూప్ సహాయం లేకుండా తన సినిమాల్లో స్టంట్స్, ముఖ్యంగా బైక్ రైడింగ్ సీన్స్ చేస్తుంటారు. కొన్నిసార్లు షూటింగులో గాయపడ్డారు కూడా! అయినా సరే ఏ మాత్రం లెక్కచేయకుండా షూటింగ్ లో పాల్గొన్నారు. ఇక ఈ చిత్రంలో తెలుగు హీరో కార్తికేయ కీలక మైన పాత్రలో నటించారు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఆయన తన శరీర దారుఢ్యాన్ని పెంపొందించుకున్నారు" అన్నారు.  Also read: 'య‌ముడికి మొగుడు'కు ఆధారం హాలీవుడ్ ఫిల్మ్ 'హెవెన్ కెన్ వెయిట్‌'!

 

'వ‌లిమై'లో అజిత్ కుమార్, కార్తికేయ గుమ్మకొండ,  హ్యుమా ఖురేషి,  గుర్బాని జడ్జ్‌, సుమిత్ర, యోగిబాబు, సెల్వ, జి.ఎం. సుందర్, అచ్యుత్ కుమార్, చైత్ర రెడ్డి, తదితరులు న‌టించారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com