బాక్సింగ్ లెజండ్ జీవితంపై ఎన్ని సినిమాలో..
on Jun 5, 2016

రోటీన్ కథలకు కాలం చెల్లిపోవడంతో..కొత్తగా వినూత్నంగా ఉండే కథలను అన్వేషించే పనిలో పడ్డారు దర్శక నిర్మాతలు. అలా వారికి కనిపించిన కథా వస్తువు ప్రముఖుల జీవిత కథలు. భారత్‌లో ప్రసిద్ధ వ్యక్తుల జీవితాలను వెండితెరపై అద్బుతంగానే ఆవిష్కరించారు. అలా ఒకరి జీవితంపై ఒకసారి మాత్రమే సినిమా తీయగలరు. కాని వీరందరికి భిన్నంగా ఒక వ్యక్తిపై ఇప్పటి వరకు ఏడు సినిమాలు వచ్చేయంటే మీరు నమ్ముతారా? ఆ వ్యక్తి ఎవరో కాదు. నిన్న కన్నుమూసిన బాక్సింగ్ లెజండ్ మొహ్మద్ ఆలీ. ఇప్పటి వరకు ఆయన జీవితంపై 7 సినిమాలు వచ్చాయి. అవి వరుసగా ఆలీ..ది ఫైటర్, ది గ్రేటేస్ట్, ఇన్ వుయ్ వర్ కింగ్స్, ఆలీ, ఫేసింగ్ ఆలీ, ఐయామ్ ఆలీ. ఈ సినిమాలన్నింటిలో ఆయనలోని ఒక్కో కోణాన్ని చూపించగలిగారు గాని పూర్తి జీవితాన్ని ఏ ఒక్క దర్శకుడు చూపించలేకపోయాడు. దటీజ్ మొహ్మద్ ఆలీ.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



