క్లైమాక్స్‌కొచ్చిన బాహుబలి షూటింగ్..
on Jun 5, 2016

తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటి చెప్పింది బాహుబలి. బాహుబలి ద బిగినింగ్‌లో తన మాయాజాలంలో ప్రేక్షకులను కట్టిపడేసిన దర్శకధీరుడు రాజమౌళి ఇప్పుడు పార్ట్-2లో ఏం మాయ చేయబోతున్నాడా అని సినీ ప్రపంచం ఆసక్తితో ఎదురుచూస్తోంది. ఇప్పటికే మెయిన్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఇక సినిమాలో కీలకమైన పతాక సన్నివేశాల చిత్రీకరణ జూన్ 13 నుంచి ప్రారంభంకానుంది. ఈ మేరకు నిర్మాత శోభు యార్లగడ్డ తెలిపారు. కొద్ది రోజులుగా హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్న బాహుబలి టీం త్వరలో సెట్స్ మీదకు రానుంది. ఈ షెడ్యూల్‌లో భారీ యుద్ధ సన్నివేశాలు తెరకెక్కించనున్న నేపథ్యంలో ఇప్పటికే ఫ్రీ విజువలైజేషన్‌తో పాటు,పోరాట సన్నివేశాలకు సంబంధించిన రిహార్సల్స్‌ను కూడా పూర్తి చేసినట్టుగా తెలిపారు. షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా వేగంగా పూర్తి చేసి 2017 ఏప్రిలోలో సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



