పంజాబ్‌పై భల్లాలదేవుడి ఫోకస్
on Jun 5, 2016
.jpg)
టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ప్రజంట్ ఏ వుడ్ చూసినా రీమేక్‌ల ట్రెండ్ నడుస్తోంది. సీనియర్ హీరోలతో పాటు యంగ్‌హీరోలకూ రీమేక్స్‌పై ఇంట్రెస్ట్ పెరిగింది. ఇప్పుడు భల్లాలదేవుడు రానా కూడా రీమేక్ థింకింగ్‌లో ఉన్నాడు. హీరోగానే కాకుండా విలన్‌గానూ రాణిస్తున్న ఈ దగ్గుబాటి చిన్నోడు ప్రజంట్ హీరోగా నిలదొక్కుకోవాలని చూస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే రీమేక్‌లు అందరికి కలిసి వస్తుండటంతో తాను రీమేక్‌లో నటించి తన సత్తా చూపించాలనుకుంటున్నాడు. పంజాబీ మూవీ సర్దార్ జీ2పై రానా మనసు పారేసుకున్నాడు. ఎందుకంటే ఏ సినిమాలో అయినా హీరో ఒకే షేడ్‌లో నటిస్తాడు. కానీ కొన్ని సినిమాల్లో మాత్రం హీరో డిఫరెంట్‌గా రెండు క్యారెక్టర్లు చేస్తాడు. అలాంటి మూవీనే సర్దార్ జీ-2 . అందుకే అలాంటి సినిమాలో యాక్ట్ చేస్తే హీరోగా తన ఇమేజ్ మరింత పెరుగుతుందని ఆశిస్తున్నాడు రానా.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



