శ్రీవిష్ణు సరసన బొంబాట్ నారి
on May 20, 2020
నితిన్ హీరోగా నటించిన 'లై' సినిమా ప్లాప్. కాకపోతే అందులో 'బాంబోలె ఉందిరా పోరి బొంబాట్‌గుందిరా నారి' సాంగ్ సూపర్ హిట్. పాటలో చిట్టిపొట్టి నిక్కర్లు వేసుకుని హీరోయిన్ మేఘా ఆకాష్ సందడి చేసింది. తర్వాత నితిన్ సరసన మరో సినిమా 'ఛల్ మోహన్ రంగ' చేసింది. రెండూ ప్లాప్స్ కావడంతో వెను వెంటనే తెలుగులో మరో సినిమా రాలేదు. మళ్లీ ఇన్నాళ్లకు ఆమెకు ఒక అవకాశం వచ్చింది.
శ్రీవిష్ణు కథానాయకుడిగా హసిత్ గోలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'రాజ రాజ చోర'. ఇందులో సునైన ఒక హీరోయిన్. మరో హీరోయిన్‌గా మేఘా ఆకాష్‌ను సెలెక్ట్ చేశారు. ఆల్రెడీ ఆమెకు కథ చెప్పారట. ఫస్ట్ నెరేషన్ లో ఓకే చెప్పిందని టాక్. మేఘా ఆకాష్ కంటే ముందు మరికొంతమంది స్టార్ హీరోయిన్స్ పేర్లు పరిశీలించారట. అయితే చివరకు ఆమె దగ్గరకు వచ్చి ఆగారు. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత మళ్ళీ షూటింగ్స్ స్టార్ట్ అయిన తర్వాత మేఘా ఆకాష్ పాత్రకు సంబంధించిన సీన్స్ తెరకెక్కించనున్నారు. ఆల్రెడీ 40 % సినిమా పూర్తి అయింది.