విడాకులపై మంచు మనోజ్ ఏమన్నాడంటే?
on May 20, 2020
కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబుగారి రెండో అబ్బాయి మనోజ్ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అప్పట్లో ఆయనే స్వయంగా ప్రకటించారు. ఆయన ప్రకటన ప్రేక్షకులు అందరికీ షాక్ ఇచ్చింది. అభిమాన వర్గాలకు అతీతంగా అందరి ఆదరణ చొరగొన్న హీరో మనోజ్. పైగా, అతడిది ప్రేమ పెళ్లి. అందుకని, షాకయ్యారు. వేరుపడుతున్నట్టు మనోజ్ చెప్పాడు గానీ కారణాలు ఏంటనేది అప్పట్లో చెప్పలేదు. తాజాగా మరోసారి విడాకులపై అతడు స్పందించాడు. అయితే ఈసారీ కారణాలు చెప్పలేదు.
"నా జీవితంలో అప్పట్లో వచ్చిన విషాదం వల్ల సిమ్లా నుండి హిమాలయాలకు ట్రెకింగ్ చేసుకుంటూ వెళ్లా. అందరికంటే ముందే ఆ విషయం నాకు తెలుసు కదా. ఆ పరిస్థితుల్లో ఎవ్వరితోనూ షేర్ చేసుకోలేక, తట్టుకోలేక అలా వెళ్ళిపోయా. ఐదేళ్లపాటు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నా ఎక్కడో తేడా జరిగింది" అని మనోజ్ అన్నాడు. మాజీ భార్య మీద నిందలు వేయకుండా తప్పంతా తనదేనని చెప్పి, మరోసారి ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు. బుధవారం మనోజ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా పది బస్సులు పెట్టి వలస కార్మికులను ఇళ్లకు పంపే మంచి పని చేస్తున్నాడు.