డిసెంబర్ - ఫిబ్రవరి.. మెగా కాంపౌండ్ `డబుల్ ధమాకా`!
on Oct 25, 2021
డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు అంటే వరుసగా మూడు నెలల పాటు `మెగా` ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు మెగా కాంపౌండ్ సిద్ధమైంది. ప్రతీ నెలలోనూ ఈ కాంపౌండ్ నుంచి రెండేసి సినిమాలు రానుండడం ప్రస్తుతం వార్తల్లో నిలుస్తోంది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మాసాల్లో మెగా క్యాంప్ అందిస్తున్న ఆ `డబుల్ ధమాకా` తాలూకు వివరాల్లోకి వెళితే..
డిసెంబర్ః
డిసెంబర్ నెలలో మెగా కాంపౌండ్ నుంచి రెండు చిత్రాలు రాబోతున్నాయి. డిసెంబర్ 3న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన స్పోర్ట్స్ డ్రామా `గని` విడుదల కానుండగా.. డిసెంబర్ 17న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ `పుష్ప` తాలుకూ తొలి భాగం `పుష్ప - ద రైజ్` రిలీజ్ కానుంది.
జనవరిః
జనవరి నెలలోనూ ఈ క్యాంప్ నుంచి డబుల్ ధమాకా ఎంటర్టైన్మెంట్ ఉండనుంది. జనవరి 7న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ హీరోగా నటించిన మల్టిస్టారర్ `ఆర్ ఆర్ ఆర్` వినోదాలు పంచనుండగా.. జనవరి 12న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్ లో సందడి చేయనున్న `భీమ్లా నాయక్` తెరపైకి రాబోతోంది.
ఫిబ్రవరిః
ఇక ఫిబ్రవరి సంగతికొస్తే.. ఈ నెలలోనూ మెగా కాంపౌండ్ డబుల్ ధమాకా ఉండబోతోంది. ఫిబ్రవరి 4న మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన `ఆచార్య` రిలీజ్ కానుండగా.. ఫిబ్రవరి 25న వరుణ్ తేజ్ ఓ హీరోగా నటించిన మల్టిస్టారర్ `ఎఫ్ 3` సందడి చేయనుంది.
మరి.. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు మెగా కాంపౌండ్ ఇవ్వనున్న ఈ డబుల్ ధమాకా.. ఎలాంటి ఫలితాలకు చిరునామాగా నిలుస్తుందో చూడాలి.