వరుస నెలల్లో చైతూ సందడి!
on Oct 25, 2021
రీసెంట్ గా రిలీజైన `లవ్ స్టోరి`తో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు యువ సామ్రాట్ నాగచైతన్య. `మజిలీ`, `వెంకిమామ`, `లవ్ స్టోరి`.. ఇలా వరుస విజయాలతో కెరీర్ లో ఫస్ట్ హ్యాట్రిక్ ని తన సొంతం చేసుకున్నాడు కూడా.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం చైతూ చేతిలో `థాంక్ యూ`, `బంగార్రాజు`, `లాల్ సింగ్ చద్ధా` (హిందీ) చిత్రాలున్నాయి. వీటిలో `లాల్ సింగ్ చద్ధా` చిత్రీకరణ పూర్తిచేసుకోగా.. `థాంక్ యూ` చిత్రీకరణ తుది దశలో ఉంది. `బంగార్రాజు` శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. ఈ మూడు సినిమాలు కూడా వరుస నెలల్లో విడుదలయ్యే అవకాశముంది.
విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న `థాంక్ యూ`.. డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు టాక్. ఇక తన తండ్రి, కింగ్ నాగార్జునతో చైతూ కలిసి నటిస్తున్న `బంగార్రాజు` 2022 సంక్రాంతి బరిలో చివరి చిత్రంగా జనవరిలో రిలీజ్ కాబోతున్నట్లు వినికిడి. అలాగే, `లాల్ సింగ్ చద్ధా` విషయానికి వస్తే.. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ తో కలిసి నాగచైతన్య నటించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ 2022 ఫిబ్రవరి 11న తెరపైకి రానుంది. మరి.. వరుస నెలల్లో విడుదల కానున్న ఈ చిత్రాలు.. చైతూకి నటుడిగా ఎలాంటి గుర్తింపుని తీసుకువస్తాయో చూడాలి.
Also Read