చిరంజీవికి ముగ్గురు భార్యలా..?
on Mar 6, 2017
అదేంటి మెగాస్టార్ చిరంజీవి గారికి సురేఖ గారు ఒక్కరే భార్యకదా..మరి ముగ్గురు భార్యలు అంటారేంటి అనుకోవచ్చు..కాని ఇది రియల్ లైఫ్‌కి సంబంధించింది కాదు..రీల్ లైఫ్‌కి సంబంధించింది. మెగాస్టార్ తన 151వ చిత్రాన్ని సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్నట్లు ప్రకటించారు. ఫిలింనగర్ టాక్ ప్రకారం చిరు రాయలసీమకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథను సినిమాగా మలచాలని అనుకుంటున్నాడు. మొదట తన రీఎంట్రీ మూవీగా ఈ కథనే తీయాలనుకున్నారు. చిరు అడిగిందే తడవుగా పరుచూరి బ్రదర్స్ స్క్రిప్ట్ కూడా రెడీ చేశారు. అయితే తనకు బాగా నచ్చిన మాస్ ఫార్ములాతోనే ముందుకు వెళ్లాలని మెగాస్టార్ డిసైడ్ అయ్యారు. అనుకున్నట్లుగానే ఖైదీ నెం.150 భారీ వసూళ్లతో చిరు స్టామినా ఏంటో మరోసారి టాలీవుడ్‌కు చూపించింది.
ఇప్పుడు ఇదంతా గతం..ఇక వర్తమానానికి వస్తే ధృవ మూవీని హై టెక్నికల్ వాల్యూస్‌తో భారీగా తెరకెక్కించాడు సురేందర్ రెడ్డి. సురేందర్ పనితనం బాగా నచ్చిన చిరు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని డైరెక్ట్ చేసే బాధ్యతను అప్పగించాడు. దీనిపై రీసెర్చ్ మొదలెట్టిన సురేందర్ రెడ్డి, ఉయ్యాలవాడ పుట్టుపూర్వోత్తరాలు బయటకు తీస్తున్నాడు. చరిత్ర ప్రకారం ఆయనకు ముగ్గురు భార్యలు ఉండటంతో చిరు సరసన ముగ్గురు హీరోయిన్లను పెట్టాలని భావిస్తున్నాడట సురేందర్ రెడ్డి. ఇంతకి మెగాస్టార్‌తో చిందేసే ఆ ముగ్గురు భామలు ఎవరో వేచి చూడాలి.