వెంకటేష్ ''మందు'' పాట భలే వుంది
on Mar 6, 2017
'''బాధలు మర్చిపోవడానికి పీతల్లా తాగుతున్నారు కానీ, లోపల లీవర్ దొబ్బుతుందనీ, ఆరోగ్యం షెడ్డుకి వెళుతుందనీ, జిందగీ బర్బాద్ అయిపోతుందనీ..అసలు తెలుసుకోరే... జీవితం అంటే సినిమా కాదురా అయ్యా.. ప్రతీది సెన్సార్ బోర్డ్ చూసుకోవడానికి. ధూమపానం,మధ్య పానం మహా చెడ్డవిరా అని ఎంత చెప్పినా వినరే. మీలాంటి వాళ్ళ కోసమే యముడి పక్క సీటు రెడీగా వుంది. బయల్దేరండి బయల్దేరండి. అబ్భే మాకు తెల్దుమరి అంటారా ? తాగండి.. ఊగండి.. మీ సావు మీరు సావండహే..'' ఇదంతా ఏమిటని అనుకుంటున్నారా?మందుబాబులకు విక్టరీ వెంకటేష్ ఇస్తున్న మెసేజ్.
వెంకటేష్ తాజా చిత్రం గురు. బాలీవుడ్‌లో విజయం సాధించిన ‘సాలా ఖదూస్’కి రీమేక్ గా తెరకెక్కింది. ఇందులో మందు బాబులకు ఉద్దేశించి ఓ పాట వుంది. ఈ పాటను స్వయంగా వెంకటేష్ పాడారు. పైన చెప్పిన మాటలు ఈ పాటలోనివే. కబాలి ఫేం సంతోష్ నారాయణ్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించాడు. ఈ పాట కోసం ఓ పెప్పి బీట్ ను రెడీ చేశాడు. ఈ బీట్ లో వెంకటేష్ వాయిస్ అయితే బావుటుందని భావించిన చిత్ర యూనిట్ ఆయన్ని ఒప్పించడం , పాడించడం జరిగిపోయింది. కొద్దిసేపటి క్రితమే పాటను కూడా రిలీజ్ చేశారు. భలే గమ్మత్తుగా వుంది పాట.
ఇటివల యాక్టర్లు సింగర్లుగా మారుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వెంకటేష్ కూడా ఈ లిస్టు లో చేరిపోయారన్నమాట. సినిమా విషయానికి వస్తే.. ఓ బాక్సింగ్ కోచ్ స్టోరీ ఇది. సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ సినిమాని పివిపి సంస్థ నిర్మించింది. తర్వలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.