కేక పెట్టిస్తున్న ఖైదీ నెం.150 సాంగ్
on Dec 1, 2016

పది, పన్నెండేళ్ల క్రితం చిరంజీవి సినిమా వస్తుందంటే చాలు..రాష్ట్రమంతా ఒకటే కోలాహలం, పోటీలు పడి ఫ్లెక్సీలు, కటౌట్‌లు, ధియేటర్‌లకు అలంకరణలు, టిక్కెట్ల కోసం అర్థరాత్రుల నుంచి పడిగాపులు అబ్బో అది మాటల్లో చెప్పలేం. ఆ తర్వాత అన్నయ్య రాజకీయాల్లో బిజీ అవ్వడంతో ఆ వాతావరణం మాయమైపోయింది. తాజాగా తొమ్మిది సంవత్సరాల లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ చిరు సినిమాల్లో నటిస్తున్నారు. ఖైదీ నెం.150 ద్వారా తిరిగి ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నారు మెగాస్టార్. నాటి యువతరంలో చాలా మంది నేడు పెద్దలైపోయారు. అందుకే అప్పటి వాతావరణం ఎలావుండేదో..ఆయన రాకకోసం ఎంతగా నిరీక్షిస్తున్నామో తెలిపేలా చిరు అభిమాని సత్యసాగర్ ఒక పాట రాసి స్వయంగా మ్యూజీక్ కంపోజ్ చేయగా.. హేమచంద్ర పాడారు. తెలుగువన్ సంస్థ రిలీజ్ చేసిన ఆ పాట ఇప్పుడు యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



