ఇక మీదట ధియేటర్లలో లేచినిలబడాల్సిందే..
on Nov 30, 2016
.jpg)
మనం సినిమా హాల్లో అడుగుపెట్టగానే ఈ నగరానికి ఏమైంది అంటూ సాగే మేసేజ్‌తో పాటు వాషింగ్ పౌడర్ నిర్మా అనే కమర్షియల్ యాడ్స్ వస్తూ ఉంటాయి. అయితే ఇక మీదట వాటన్నింటికంటే ముందు ఒక పాట వస్తుంది. అప్పుడే హాల్‌లోకి వచ్చి కూర్చుంటున్న వాళ్లు..హాల్లోకి వస్తున్న వాళ్లు ఎక్కడికక్కడ నిలబడిపోవాలి..ఇంకా అర్థం కాలేదా..అది మన జాతీయ గీతమని.
అసలు మ్యాటరేంటంటే గత కొన్ని రోజులుగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో సినిమా హాల్లో జాతీయ గీతాన్ని ప్రదర్శిస్తున్నారు. అయితే వినోదం కోసం ధియేటర్లకు వచ్చే ప్రేక్షకుడిని దేశభక్తిని ప్రదర్శించమనడమేంటి, ఇలాంటి చర్యలతో జాతీయ గీతాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ ఒక సామాజిక కార్యకర్త సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు.
దీనిని విచారించిన సుప్రీం ధియేటర్లలో జాతీయగీతాన్ని తప్పనిసరిగా ప్రసారం చేయాల్సిందేనని ఆదేశించింది. ప్రస్తుత తరంలో చాలామందికి కనీసం పూర్తి జాతీయ గీతం నోటికి రావట్లేదని, గీతాన్ని ఎలా పాడాలో కూడా తెలియని పరిస్థితుల్లో నేటి యువత ఉన్నారని.. ఎక్కువ మంది యువత గుమిగూడే ప్రాంతం ధియేటర్లే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ జనగణమణ ప్లే చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. అంతేకాకుండా జాతీయగీతం ప్లే అవుతున్నప్పుడు ఎవరైనా కూర్చుంటే కఠిన శిక్ష విధించాలని పేర్కొంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



