"వంగవీటి"పై రంగా తనయుడి కేసు
on Dec 1, 2016
.jpg)
సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న వంగవీటి సినిమాకు ఎదురుదెబ్బ తగిలింది. వాస్తవాలకు విరుద్ధంగా సినిమా చిత్రీకరిస్తున్నారంటూ వంగవీటి మోహనరంగా తనయుడు, మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ వేశారు. అంతేకాకుండా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ ఆమోదం లేకుండా సినిమా ట్రైలర్, టీజర్లను ఇంటర్నెట్, యూట్యూబ్, ట్వీట్టర్‌లలో ప్రదర్శిస్తున్నారంటూ రాధా పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ, నిర్మాత దాసరి కిరణ్‌కుమార్‌లకు నోటీసులు జారీ చేసింది. కేసు విచారణను డిసెంబర్ 2కు వాయిదా వేసింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



