అ..ఆ టీజర్ రివ్యూ : క్యూట్ లవ్ స్టోరీ
on Apr 13, 2016

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, నితిన్, సమంతల కాంబినేషన్లో వస్తున్న సినిమా అ..ఆ. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి టాక్ రావడంతో, ఈ రోజు టీజర్ రిలీజ్ చేశారు త్రివిక్రమ్ అండ్ కో. టీజర్ ఓపెన్ అయిన తర్వాత మూడు షాట్లు సమంత క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఉంటాయి. ఆ తర్వాత ట్రెయిన్ జర్నీలో అనసూయ రామలింగం, ఆనంద్ విహారి ల పేర్ల ఇంట్రడక్షన్ చూపించాడు. నితిన్ ట్రైన్ ఎక్కడానికి పరిగెడుతూ వచ్చే షాట్, ఇంట్లో ఫన్నీ ఎక్స్ ప్రెషన్ పెట్టే షాట్, కాఫీ కప్ తో నితిన్ సీరియస్ గా చూస్తున్న షాట్, వీటికి కాంప్లిమెంటింగ్ గా మిక్కీ జే మేయర్ ఇచ్చిన మ్యూజిక్. పక్కపక్కనే ఉండే అక్షరాలు పరిచయం కావడానిక పాతికేళ్లు పట్టింది అంటూ సమంత అనుకుంటున్న షాట్ చూపిస్తూ టీజర్ ఎండ్ చేశాడు త్రివిక్రమ్. ఒక్కమాటలో చెప్పాలంటే, ఒక సింపుల్ లవ్ స్టోరీని చూపించబోతున్నానని, టీజర్లో తెలియజెప్పాడు త్రివిక్రమ్. అ..ఆ మే లో థియేటర్లలో సందడి చేయనుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్.రాథాకృష్ణ ఈ సినిమాను తెరకెక్కించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



