రేపల్లెలో చెర్రీ లుక్ అదిరిపోయింది
on Mar 20, 2017
మిగిలిన డైరెక్టర్లతో పోలిస్తే సుకుమార్ సినిమాల్లో హీరోలు కాస్త వెరైటీగా కనిపిస్తారు. కాస్ట్యూమ్స్, లుక్, హెయిర్ స్టైల్ అన్నిట్లోనూ తన హీరోలను కొత్తగా చూపిస్తాడు సుకుమార్. అల్లు అర్జున్, మహేశ్, ఎన్టీఆర్‌లు సుకుమార్ డైరెక్షన్లో మోస్ట్ స్టైలిష్‌గా కనిపించారు. గతేడాది నాన్నకు ప్రేమతో మూవీతో హిట్ కొట్టిన సుక్కు తాజాగా మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌ని డైరెక్ట్ చేస్తున్నాడు . దీనికి రేపల్లె అని టైటిల్ కూడా ఫిక్స్ చేశారు.
అచ్చ తెలుగు టైటిల్ పెట్టినప్పటికీ ఇందులో హీరో మాత్రం మోడ్రన్‌గా కనిపిస్తాడట..అందుకు తగ్గట్టుగానే రామ్‌చరణ్‌ను సినిమాకి తగ్గట్టుగా మార్చే పనిలో బిజీగా ఉన్నాడు సుక్కు..రీసెంట్గా విశాఖ అవంతి కాలేజీ ఫెస్ట్‌లో పాల్గొన్న చరణ్ న్యూలుక్లో దర్శనమిచ్చాడు. హెయిర్ బాగా పెంచేసి బారెడు గడ్డంతో న్యూలుక్లో కనిపించిన చెర్రీని చూసిన అక్కడి యూత్ మెస్మరైజ్ అయ్యింది..ఇంకేముంది ఆ లుక్ సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో దానిని ట్రై చేసేందుకు సెలూన్స్‌కు పరుగులు తీస్తున్నారు అభిమానులు.