పవన్‌ని రెచ్చగొట్టేశారు.. ఇక ఏమవుతుందో..?!
on Mar 20, 2017
.jpg)
పవన్ కల్యాణ్ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ రగడ రోజురోజుకీ ముదిరిపోతోంది. చెప్పను బ్రదర్ అనే ఒకే ఒక్క డైలాగ్ తో పవన్ ఫ్యాన్స్‌కి యాంటీ అయిపోయాడు బన్నీ. అప్పటి నుంచీ.. బన్నీ ఎప్పుడు దొరుకుతాడా?? అంటూ పవన్ ఫ్యాన్స్ ఎదురుచూడడం మొదలెట్టారు. ఆఖరికి దువ్వాడ జగన్నాథమ్ టీజర్‌తో అడ్డంగా దొరికిపోయాడు బన్నీ. ఈ టీజర్ యూ ట్యూబ్‌లో కొత్త రికార్డులు సృష్టించింది.. డిజ్ లైక్స్ విషయంలో. సాధారణంగా టాప్ స్టార్ సినిమా టీజర్ అంటే... అందరి దృష్టీ హిట్స్ మీదే ఉంటుంది. కానీ.. డీజే డిజ్ లైక్స్ లో రికార్డు సృష్టించింది. కొంతమంది యాంటీ బన్నీ ఫ్యాన్స్.... డీజే కి డిజ్ లైక్స్ కొడుతూ... దాన్నో సంచలనంగా మార్చారు.
డీజే కి వచ్చిన డిజ్ లైక్స్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇప్పుడు బన్నీ ఫ్యాన్స్ వంతు వచ్చింది. కాటమరాయుడు ట్రైలర్ కూడా డిజ్ లైక్స్ విషయంలో కొత్త రికార్డులు నెలకొల్పేలా ఉంది. ఇప్పటి వరకూ ఈ ట్రైలర్‌కు 45 వేల డిజ్ లైక్స్ వచ్చాయి. త్వరలోనే లకారం పూర్తయిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. డీజే డిజ్ లైక్స్ విషయంలో ఫ్యాన్స్ ఎలా మాట్లాడుకొన్నారో.. ఇప్పుడు కాటమరాయుడు విషయంలోనూ అలానే ఆసక్తికరంగా మాట్లాడుకొంటున్నారు. రేయ్... నన్ను రెచ్చగొట్టకండ్రా.. అనే పవన్ కల్యాణ్ డైలాగ్‌తో కాటమరాయుడు ట్రయిలర్ మొదలైంది. ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ ని రెచ్చగొట్టేస్తున్నారు. బన్నీ ఫ్యాన్స్‌కి షాక్ కలిగే.. ప్లాన్‌తో పవన్ ఫ్యాన్స్ ఎలాంటి ట్రీట్‌మెంట్‌తో వస్తారో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



