పాత ఫాం కోసం రవి పాట్లు..
on Aug 18, 2016
రవితేజ...తెలుగు సినిమాలో ఎనర్జిటిక్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్..ప్రోడ్యూసర్లకు, దర్శకులకు మినిమిమ్ గ్యారేంటీ హీరో. ఏడాదికి రెండు మూడు సినిమాలు విడుదల చేసే ఈ మాస్ హీరో..ఇప్పుడు చాలా సైలెంట్‌గా కనిపిస్తున్నాడు. అప్పుడెప్పుడో డిసెంబర్‌లో వచ్చిన బెంగాల్ టైగర్ తర్వాత మళ్లీ కొత్త సినిమా ఏదీ స్టార్ట్ చేయలేదు. 9 నెలల పాటు ఖాళీగా ఉండటమంటే అదో పెద్ద రికార్డ్. రవి ఫుల్ టైం హీరోగా మారాకా ఇంత భారీ గ్యాప్ ఎప్పుడూ రాలేదు.
అయితే ఎలాగైనా సరే పాత ఫాం అందుకోవాలని రవి డిసైడ్ అయ్యాడట. అందుకే ఒకే సమయంలో రెండు సినిమాలు పట్టాలెక్కించబోతున్నాడు. పవర్ సినిమాతో రవితేజను కొత్తగా చూపించిన బాబీకి మరో ఛాన్స్ ఇచ్చినట్టు టాక్. ఓ సౌత్ కొరియన్ మూవీని..తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్చి..మాస్ మహారాజ్‌తో సినిమా చేస్తున్నారు. మరోవైపు విక్రమ్-దీపక్ అనే జంట దర్శకులతో కూడా ఓ మూవీని రవితేజ చేయనున్నాడు. ఇందులో స్టైలిష్ పోలీస్‌గా రవి అల్లరి చేయనున్నాడట. రెండు నెలల గ్యాప్‌లో ఈ రెండు సినిమాలు రిలీజ్ చేయాలన్నది మాస్ మహరాజా మాస్టర్ ప్లాన్.