ఇలా చేస్తావనుకోలేదు మారుతీ.....
on Aug 18, 2016
.jpg)
సినిమా హిట్టయితే.. అంతా నా వల్లే అయిందని పొంగిపోతారు హీరోలు, దర్శకులు. ఫ్లాప్ అయితే మాత్రం `నా వల్ల కాదం`టే `నావల్లకాదు` అంటూ తప్పించుకొంటారు. ఇప్పుడు వెంకటేష్ - మారుతిల పరిస్థితి కూడా అంతే. బాబు బంగారం ఫ్లాప్‌ని ఎవరిపై వేయాలా?? అంటూ ఒకరినొకరు చూసుకొంటున్నట్టుంది వ్యవహారం. వీరిద్దరి కాంబినేషన్ పరిశ్రమలో ఆసక్తిని పెంచిన మాట వాస్తవం. ఎందుకంటే మారుతిలో కామెడీ యాంగిల్ కావల్సినంత ఉంది. అది పండించడంలో వెంకీ సిద్ధహస్తుడు. అందుకే వీరిద్దరి నుంచి సినిమా వస్తోందంటే ఆశగా ఎదురుచూశారు సినీ జనాలు. రాధ మొదలైనట్టే మొదలై ఆగిపోయింది. ఆ లోటు భర్తీ చేయడానికి ఇద్దరూ కలసి 'బాబు బంగారం' తీశారు. సినిమా విడుదలకు ముందు ఇద్దరూ కాన్ఫిడెన్స్‌గానే కనిపించారు. ఒకరిపై ఒకరు పొగడ్తల వర్షం కురిపించుకొన్నారు.
సినిమా ఫలితం తారు మారు అయ్యే సరికి ఇద్దరూ మొహం చాటేస్తున్నారని తెలిసింది. సినిమా టాక్ బయటకు వచ్చాక.. మారుతికి ఫోన్ చేసిన వెంకీ.. బ్రెయిన్ వాష్ చేశాడట. 'సినిమా ఇలా తీస్తావనుకోలేదు' అంటూ సూటిపోటి మాటలు అనేశాడట వెంకీ. మరోవైపు మారుతి కూడా 'నేను చెప్పినట్టు చేయలేదు.. అందుకే ఇలాంటి పరిస్థితి వచ్చింది' అంటూ వాపోతున్నాడట. నయన తారని తీసుకోవొద్దని మారుతి ఎంత చెప్పినా వెంకీ వినలేదట. పట్టుబట్టి కావాలని తీసుకొచ్చారట. అయితే నయన సరిగా సహకరించకపోయేసరికి ఆప్రభావం సినిమాపై కూడా పడిందని సన్నిహితులతో చెబుతున్నాడట మారుతి. కర్ణుడి చావుకి వంద కారణాలన్నట్టు.. ఫ్లాప్ సినిమాకీ ఇలాంటి సాకులు వెతకాలి లెండి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



