ఎవరా అనుకోకండి మన కార్తీనే..!
on Aug 18, 2016
చిలిపితనం..అల్లరి కలబోసిన కుర్రాడిగా ఇన్నాళ్లు ఆకట్టుకున్న కార్తీ ఇప్పుడు తనలోని మరో యాంగీల్‌ని చూపించాడు. అన్న సూర్య బాటలో ప్రయోగాత్మక చిత్రం చేస్తున్నాడు. అదే "కాష్మోరా".. ఈ సినిమాలో కార్తీ ఎలా ఉండబోతున్నాడా అని ఎదురు చూస్తున్న అభిమానులకు రాఖీ కానుకగా నిన్న "కాష్మోరా" ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. దానిలో పూర్తిగా గుండు చేయించుకుని, ఓ సైనికాధికారిగా, యుద్ధరంగంలో ఉంటూ అచ్చం బాహుబలి సినిమాలో కాళకేయుడిగా చాలా డిఫరెంట్‌గా కనిపిస్తున్నాడు కార్తీ. ఈ సినిమాలో కెరిర్‌లోనే తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తున్నాడు కార్తీ..భారతీయ సినీ చరిత్రలోనే ఫస్ట్‌టైం 3డి ఫేస్ స్కానింగ్, 360 డిగ్రీ ఓమ్నీ డైరెక్షనల్ కెమెరా టెక్నాలజీని ఈ సినిమాలో వినియోగించారు. కార్తీ సరసన నయనతార, శ్రీవిద్య ఆడిపాడనున్నారు. గోకుల్ దర్శకత్వంలో పీవీపీ సంస్థ ఈ కాష్మోరా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దీపావళి కానుకగా కాష్మోరా ధియేటర్లలో సందడి చేయనుంది.