తారక్‌ది మంచి హృదయం: మణిశర్మ
on Feb 7, 2020
ఆకలితో బాధపడే అనాథల కోసం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు 'డొనేట్ ఎ మీల్' అనే కార్యక్రమాన్ని సంకల్పించారు. ఫుట్‌పాత్‌ల మీద జీవిస్తూ, అన్నం కోసం ఎదురుచూసే వాళ్ల కోసం 'టీమ్ తారక్ ట్రస్ట్' నెలకొల్పిన ఈ కార్యక్రమం పోస్టర్‌ను ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ హైదరాబాద్‌లోని తన స్టూడియోలో ఆవిష్కరించి, ఇలాంటి మంచి పనులు చేస్తున్న ట్రస్ట్ సభ్యులను అభినందించారు. ఏడాది నుంచీ ఈ ట్రస్ట్ ఈ తరహా ప్రజోపయోగ పనులు చేస్తూ, పేదలకు, అన్నార్తులకు ఆలంబనగా ఉండటం గొప్ప విషయమని చెప్పారు.
హీరోల అభిమానులంటే కేవలం తమ హీరోల సినిమాలు రిలీజైనప్పుడు హంగామా చేయడం కాకుండా ఆ హీరోలకు పేరు తెచ్చేలా, ఈ తరహా సామాజిక కార్యక్రమాలు చేయడం ముదావహమని తెలిపారు. ఇలాంటి మంచి పనులకు తన సహాయ సహకారాలు ఉంటాయన్నారు. తారక్‌తో తనకు మంచి అనుబంధముందనీ, ఆయనది చాలా మంచి హృదయమనీ, ఆయన బాటలో అభిమానులు నడుస్తుండటం ఆనందంగా ఉందనీ అన్నారు. ప్రతిరోజూ వీలైనంతమంది అన్నార్తులకు ఒకపూట కడుపునిండా భోజనం పెట్టడమే 'డొనేట్ ఎ మీల్' లక్ష్యమని ట్రస్ట్ సభ్యులు చెప్పారు.