Home

»

Latest News

'ఓ పిట్ట కథ' టీజర్‌ను మహేశ్ లాంచ్ చేశాడు

Feb 7, 2020 5:13PM

 

సీనియర్ యాక్టర్ బ్రహ్మాజీ కుమారుడు సంజయ్ రావు హీరోగా పరిచయమవుతున్న 'ఓ పిట్ట కథ' మూవీ టీజర్‌ను శుక్రవారం సూపర్ స్టార్ మహేశ్ లాంచ్ చేశాడు. 5.05 నిమిషాల ముహూర్తానికి ఆయన తన సోషల్ మీడియా హ్యాడిల్స్ ద్వారా టీజర్‌ను ఆవిష్కరించి, "ఓ పిట్ట కథ మూవీ టీజర్‌ను లాంచ్ చేసినందుకు హ్యాపీగా ఉంది. ఫస్ట్ సినిమా చేస్తున్న సంజయ్ రావుకు శుభాభినందనలు. మొత్తం యూనిట్‌కు శుభాకాంక్షలు" అని ట్వీట్ చేసి, నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్, నటుడు బ్రహ్మాజీ, డైరెక్టర్ చెందు ముద్దు ట్విట్టర్ హ్యాండిల్స్‌కు ట్యాగ్ చేశారు.

దీనికి బ్రహ్మాజీ స్పందించారు. "థాంక్ యు సూపర్ స్టార్. మీరు సినిమాని ప్రేమిస్తారు. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చెయ్యడానికి ఎప్పుడూ ముందుంటారు. ఈ సినిమాపై మీరు చూపిన ప్రేమను మా టీం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. వియ్ లవ్ యు. టేక్ ఎ బౌ" అని ట్వీట్ చేశారు.

ఈ మూవీ టైటిల్‌ పోస్టర్‌ని ఇటీవలే త్రివిక్రమ్‌ విడుదల చేయగా, క్యారెక్టర్స్‌ పోస్టర్‌ను కొరటాల శివ ఆవిష్కరించడం గమనార్హం. సంజయ్ రావుతో పాటు విశ్వంత్ దుద్దుంపూడి హీరోగా నటిస్తోన్న ఈ మూవీలో నిత్యాశెట్టి హీరోయిన్. చెందు ముద్దు దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ మూవీలో బ్రహ్మాజీ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేస్తున్నాడు. మార్చి 6న 'ఓ పిట్ట కథ'ను విడుదల చేయడానికి నిర్మాత వి. ఆనందప్రసాద్ సన్నాహాలు చేస్తున్నారు.

ఆకట్టుకున్న టీజర్:
కాగా 'ఓ పిట్ట కథ' టీజర్ ఆకట్టుకుంటోంది. ఇందులో పాత్రలతో పాటు, కంటెంట్‌నూ పరిచయం చేశారు. ఒక ఊరిలో వెంకటలక్ష్మి అనే అందమైన అమ్మాయి ఉంటుందనీ, ఆమెను అదే ఊరికి చెందిన ప్రభు అనే కుర్రాడు ఇష్టపడుతున్నాడనీ, అలాగే విదేశాల నుంచి వెంకట్లలక్ష్మి ఇంటికి వచ్చిన మరో యువకుడు క్రిష్ కూడా ఆమెను ప్రేమించాడనీ ఆ టీజర్ తెలిపింది. ఆ ఇద్దరిలో ఎవరికి వెంకటలక్ష్మి మనసిచ్చింది అనే విషయం తెలిసేలోగా ఆమెను ఎవరో ముసుగువేసుకున్న ఆగంతకుడు కిడ్నాప్ చేశాడు. ఆ కేసును ఛేదించడానికి ఒక పోలీసాఫీసర్ వచ్చాడు. వెంకటలక్షమిని ఎవరు, ఎందుకు చేశారనే విషయం సినిమా చూసి తెలుసుకోవాల్సిందేనని ఒక పాప వాయిస్ ద్వారా చెప్పించారు. వెంకటలక్ష్మిగా నిత్యాశెట్టి, ప్రభుగా సంజయ్ రావు, క్రిష్‌గా విశ్వంత్ నటిస్తున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com