అలీ రెడీ... మరి పవన్?
on Feb 8, 2020

'అలీ లేకుండా నా సినిమా ఉండదు. అలీ నా గుండె'
- 'అత్తారింటికి దారేది' ఆడియో వేడుకలో అలీ గురించి పవన్ కల్యాణ్ చెప్పిన మాట. తర్వాత ఇద్దరూ ఆత్మీయంగా కౌగిలించుకున్నారు.
'నా చేతికి శక్తి ఉండదని నమ్ముతారా? నా వేళ్లకు శక్తి ఉందని నమ్ముతారా? నేను టచ్ చేయకుండా అలీతో డాన్స్ చేయిస్తా'
- 'కాటమరాయుడు' ప్రీ రిలీజ్ వేడుకలో పవన్.
చెప్పినట్టు డాన్స్ చేయించారు. అలీకి పవన్ కౌగిలింతలు పెట్టబోతే అతడు మెలికలు తిరిగాడు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, కమెడియన్ అలీ మధ్య స్నేహం గురించి చెప్పడానికి ఈ రెండు సంఘటనలు చాలు. అయితే... అదంతా గతం. వ్యక్తిగతంగా, సినిమాల పరంగా వీరిద్దరి మధ్య ఏర్పడిన స్నేహానికి రాజకీయాలు తూట్లు పొడిచాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ తరపున అలీ ప్రచారం చేశారు. పవన్ కల్యాణ్ తన సొంత పార్టీ జనసేన తరపున పోటీ చేశారు. ఎన్నికల ప్రచారంలో ఒకరిపై ఒకరు మాటలు అనుకున్నారు. అలీ చెప్పిన వ్యక్తికి తానూ ఎంపీ టికెట్ ఇచ్చాననీ, అతడికి సాయం చేశానని పవన్ అన్నారు. అందుకు బదులుగా అలీ ఘాటైన విమర్శలు చేశారు. "మీ అన్నయ్య చిరంజీవిగారు వేసిన దారిలో మీరు వచ్చారు. నేను నా సొంతదారిలో వచ్చాను. మీరు నాకెప్పుడూ ఎలా సహాయం చేశారో చెప్పండి" అని అలీ అన్నారు. అదంతా గతం. వర్తమానానికి వస్తే... పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాలు చేస్తున్నారు. ఆ సినిమాల్లో అలీకి ఛాన్స్ ఇస్తున్నారా? లేదా? పవన్, అలీ కలిసి నటిస్తున్నారా? లేదా? అని డిస్కషన్స్ మొదలయ్యాయి. కొందరు అయితే అలీని పవన్ సినిమాలో నటించమని అడిగితే.... అతడు ఆలోచిస్తున్నాడని పుకార్లు సృష్టించారు. నిజం ఏంటంటే... అవన్నీ అబద్దాలు!
"పవన్ కల్యాణ్ చేస్తున్న సినిమాల వాళ్లు ఎవరూ నన్ను నటించమని సంప్రతించలేదు. కానీ, వాళ్లు నన్ను సంప్రతిస్తే... పవన్ సినిమాలో నటించడానికి నేను రెడీ. నేను ఎప్పుడూ సినిమాలు, రాజకీయాలను కలపను" అని అలీ స్పష్టత ఇచ్చారు. అదీ సంగతి. మరి, అలీకి పవన్ కల్యాణ్ ఛాన్స్ ఇస్తారా? లేదా? వెయిట్ అండ్ సి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



