సమంతకూ, నాకూ మధ్య ఉన్నదేంటో నాగచైతన్యకు తెలుసు!
on Oct 11, 2021
భార్యాభర్తలుగా విడిపోతున్నామని నాగచైతన్య, సమంత ప్రకటించగానే, సమంతను లెఫ్ట్, రైట్, సెంటర్ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు నెటిజన్లు. తన స్టైలిస్ట్ ప్రీతమ్ జుకాల్కర్‌తో బంధమే చైతూతో ఆమె విడాకులకు కారణమని చాలామంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు.. తనకూ, సమంతకూ అలాంటి ఎఫైర్ ఏమీ లేదని నాగచైతన్య నోరువిప్పి మాట్లాడితే, ఆ రూమర్స్‌కు చెక్ పడుతుందని ప్రీతమ్ అంటున్నాడు.
టైమ్స్ ఆఫ్ ఇండియాకు వచ్చిన ఇంటర్వ్యూలో నాగచైతన్య ఉదాసీన మౌనంతో తాను బాగా అప్సెట్ అయ్యాయని చెప్పాడు. సమంత తనకు సోదరి లాంటిదనీ, ఆమెను తను "జీజీ" అని పిలుస్తాననీ వెల్లడించాడు. "సమంతను నేను 'జీజీ' అని పిలుస్తానని అందరికీ తెలుసు. ఉత్తరాదిన దానర్థం 'అక్క' అని. మా మధ్య లింకప్ ఎలా సాధ్యం?" అని అతను ప్రశ్నించాడు.
"చాలా సంవత్సరాలుగా నాకు చైతన్య తెలుసు. సమంతకూ, నాకూ మధ్య ఎలాంటి బంధం ఉందో అతనికీ తెలుసు. అతను నోరువిప్పి సామ్కూ, నాకూ మధ్య అలాంటిదేమీ లేదని జనానికి చెబితే బాగుంటుందని అనుకుంటున్నా. అతను ఒక్క స్టేట్మెంట్ ఇచ్చినా చాలు, అది చాలా పనిచేస్తుంది. ఇప్పుడు, ఈ సోకాల్డ్ ఫ్యాన్స్ ఈ రకమైన స్టేట్మెంట్స్, తప్పుడు రూమర్స్ వ్యాప్తి చేస్తున్నారు. చైతన్య వైపు నుంచి ఒక స్టేట్మెంట్ వస్తే, తమను తాము చెక్ చేసుకోడానికి ఈ జనానికి ఉపయోగపడుతుంది." అని చెప్పాడు ప్రీతమ్.
తన సోషల్ మీడియా పేజీలపై అభ్యంతరకరమైన పలు మెసేజ్‌లు వస్తున్నాయనీ, ఇవి తన మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయనీ అతను వాపోయాడు.
Also Read