'మా' బిల్డింగ్.. రెండు ఆప్షన్లు ఇచ్చిన మంచు విష్ణు!
on Oct 14, 2022

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా)కు తన సొంత డబ్బులతో బిల్డింగ్ నిర్మిస్తానని 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే మా బిల్డింగ్ కోసం తన దగ్గర రెండు ఆప్షన్లు ఉన్నాయని.. అందులో ఒక దానికి ఆరు నెలలు సమయం పడితే, రెండో దానికి మూడు-నాలుగేళ్ల సమయం పడుతుందని తెలిపాడు.
'మా' అధ్యక్షుడిగా తాను బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా గురువారం సాయంత్రం విష్ణు మీడియా సమావేశం నిర్వహించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 90 శాతం పూర్తి చేశామని తెలిపాడు. అలాగే 'మా' బిల్డింగ్ గురించి సభ్యులతో తీవ్ర చర్చలు జరిగాయని, వారి ముందు తాను రెండు ఆప్షన్లు ఉంచానని తెలిపాడు.
మొదటి ఆప్షన్ ప్రకారం 'ఫిల్మ్ ఛాంబర్'కి కాస్త దూరంలో ఒక బిల్డింగ్ చూశామని, అది ఆరు నెలల్లో పూర్తి అవుతుందన్నాడు. రెండో ఆప్షన్ వచ్చేసి.. ఫిల్మ్ ఛాంబర్ బిల్డింగ్ తీసేసి కొత్త బిల్డింగ్ కట్టబోతున్నారని, అక్కడ కొంత స్థలం కొని 'మా' ఆఫీస్ ను రూపొందించాలని చెప్పాడు. అయితే అది పూర్తి అవడానికి మూడు-నాలుగేళ్లు పడుతుందని.. కానీ అందరూ ఎక్కువగా రెండో ఆప్షన్ కే మొగ్గు చూపుతున్నారని తెలిపాడు. ఈ రెండు ఆప్షన్లలో ఏది ఓకే అయినా తన డబ్బులతోనే పూర్తి చేస్తానని విష్ణు స్పష్టం చేశాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



