సంక్రాంతి బరిలో 'NBK 107' లేనట్టే!
on Oct 14, 2022

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ బాక్సాఫీస్ వార్ కి ఉండే క్రేజే వేరు. ఆ ఇద్దరి సినిమాలు ఒకేసారి విడుదలైతే థియేటర్ల దగ్గర అసలుసిసలు పండగ వాతావరణం ఉంటుంది. ఇదిలా ఉంటే వచ్చే సంక్రాంతికి ఈ ఇద్దరి బాక్సాఫీస్ వార్ మరోసారి చూడొచ్చని సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. కానీ అది అసాధ్యమనే చెప్పాలి.
చిరంజీవి 'మెగా154'(వాల్తేరు వీరయ్య), బాలకృష్ణ 'ఎన్బీకే 107' షూటింగ్ చివరి దశలో ఉన్నాయి. ఈ రెండు చిత్రాలు సంక్రాంతికే విడుదల అవుతాయని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమాలు ఒకేసారి విడుదలయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఈ రెండు సినిమాలను మైత్రి మూవీ మేకర్స్ సంస్థనే నిర్మిస్తోంది. పైగా 'మెగా154'ని సంక్రాంతికి విడుదల చేస్తామని మైత్రి ప్రకటించింది కానీ 'ఎన్బీకే 107' విడుదల తేదీపై స్పష్టత ఇవ్వలేదు. దానిని బట్టే సంక్రాంతి బరిలో 'NBK 107' ఉండదని అర్థం చేసుకోవచ్చు.
'మెగా154' విడుదలకి రెండు-మూడు వారాల ముందు గానీ తర్వాత గానీ 'NBK 107' విడుదల ఉండొచ్చని అంటున్నారు. డిసెంబర్ చివరి వారంలో లేదా జనవరి 26న విడుదలయ్యే అవకాశముందని తెలుస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



