డబ్బింగ్ మొదలైంది.. సంక్రాంతికే 'మెగా 154'!
on Oct 14, 2022

దసరాకు 'గాడ్ ఫాదర్'తో వచ్చి అలరించిన మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతికి 'మెగా 154'(వాల్తేరు వీరయ్య)తో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. షూటింగ్ చివరి దశలో ఉండగానే, తాజాగా ఈ చిత్ర డబ్బింగ్ కార్యక్రమాలు మొదలయ్యాయి.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న 'మెగా 154'కి కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో తన సినిమా నుంచి ఆశించే అన్ని కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉంటాయని, వింటేజ్ చిరంజీవిని చూస్తారని ఇటీవల మెగాస్టార్ చెప్పారు. ఈ చిత్రాన్ని ఎలాగైనా 2023 సంక్రాంతికి తీసుకురావాలని చిత్ర యూనిట్ పట్టుదలగా ఉంది. అందుకే ఓ వైపు షూటింగ్ జరుగుతుండగానే, పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టారు.

'మెగా 154' షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. మరోవైపు ఈరోజు పూజా కార్యక్రమాలతో డబ్బింగ్ పనులు మొదలుపెట్టారు. ఈ విషయాన్ని తాజాగా మేకర్స్ తెలిపారు. అలాగే త్వరలో కీలక అప్డేట్స్ రానున్నాయని పేర్కొన్నారు.
ఈ చిత్రానికి 'వాల్తేరు వీరయ్య' అనే టైటిల్ అనుకుంటున్నారు కానీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ దీపావళికి టైటిల్ అనౌన్స్ మెంట్ తో పాటు గ్లింప్స్ విడుదల చేసే అవకాశముంది. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రలో అలరించనున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



