మంచు మనోజ్ రెండో పెళ్లికి ముహూర్తం ఖరారు!
on Feb 27, 2023

దివంగత నేత భూమా నాగిరెడ్డి రెండో కూతురు భూమా మౌనికను హీరో మంచు మనోజ్ పెళ్లి చేసుకోబోతున్నట్లు కొంతకాలంగా వార్తలొస్తున్నాయి. అయితే ఇప్పుడు వీరి పెళ్లికి ముహూర్తం కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. అతి కొద్దిమంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో మార్చి 3న వీరి పెళ్లి జరగనుందని సమాచారం.
2015లో ప్రణతి రెడ్డిని వివాహం చేసుకున్న మనోజ్ విభేదాలు రావడంతో 2019లో ఆమె నుంచి విడాకులు తీసుకున్నాడు. మరోవైపు మౌనికకు కూడా గతంలో వివాహం జరగగా.. మనస్పర్థల కారణంగా భర్త నుంచి విడాకులు తీసుకుంది. మనోజ్, మౌనిక మొదట మంచి మిత్రులు. ఆ తరువాత వారి స్నేహం ప్రేమగా మారింది. ఇప్పుడు పెద్దల అంగీకారంతో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. గతేడాది హైదరాబాద్ లోని ఓ గణేష్ మండపం వద్ద మనోజ్, మౌనిక ప్రత్యేక పూజలు చేశారు. అప్పటినుంచే వీరి పెళ్లి వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఎట్టకేలకు వీరి పెళ్లికి ముహూర్తం కుదిరిందని, మార్చి 3న పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారని తెలుస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



