విలువలకు కట్టుబడిన జీవితానికి నిదర్శనం సమంత!
on Feb 27, 2023

సమంత నటిగా పరిచయమై 13 ఏళ్లు అవుతుంది. 2010 ఫిబ్రవరి 26న సిల్వర్ స్క్రీన్ మీద ఆమె మాయజాలం చేసింది. సమంత డెబ్యూ మూవీ ఏ మాయ చేసావే అదేరోజు విడుదల అయింది. గౌతమ్ వాసుదేవ మీనన్ తన ఎమోషనల్ లవ్ స్టోరీకి ఫ్రెష్ నెస్ అయితే బాగుంటుంది అని ఆడిషన్స్ పెట్టారు. ఆడిషన్స్ హాజరైన సమంత లుక్ బాగా నచ్చేసింది. స్క్రిప్ట్ లో రాసుకున్న పాత్ర తన ముందే కూర్చున్న భావన కలిగింది. మరో ఆలోచన లేకుండా సమంతను ఓకే చేశారు. నాగచైతన్య హీరో. ఆయనకు ఇది రెండో చిత్రం. మొదటి చిత్రం జోష్. కేరళ క్రిస్టియన్ అమ్మాయి తెలుగు హిందూ అబ్బాయి మధ్య లవ్ స్టోరీ. సమంత చాలా సెటిల్డ్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నారు. కొత్త హీరోయిన్ అనే భావన ప్రేక్షకు కలగలేదు. ఏ మాయ చేసావే సూపర్ హిట్ అయింది. సమంత వెనక్కి తిరిగి చూసుకోలేదు. హిట్టు మీద హిట్టు కొట్టింది. సూపర్ స్టార్స్ తో జతకట్టింది. అందనంత రేంజ్ కి వెళ్ళింది. కమర్షియల్ లేడీ ఓరియంటెడ్, ప్రయోగాత్మక చిత్రాలన్నింటిలో నటించింది. ఫ్యామిలీమేన్2 తో డిజిటల్ సిరీస్ లో కూడా తనకు తిరుగులేని నిరూపించింది.
చదువులో ఫస్ట్. డిస్టెంషన్ మార్కులు తెచ్చుకునేది. పాకెట్ మనీ కోసం పేరెంట్స్ మీద ఆధారపట్టం సమంతాకు ఇష్టం ఉండేది కాదు. ఒకపక్క చదువుకుంటూనే డబ్బులు సంపాదించాలనుకునేది. అందుకు మోడలింగ్ చిన్నచిన్న యాడ్స్ ప్రమోషన్ ఈవెంట్స్ లో సమంత పాల్గొనేవారు. అలా వచ్చిన 1000 2000ల పాకెట్ మనీగా వాడుకునే వారట. సమంతాకు ఆత్మవిశ్వాసం ఆత్మగౌరవం చాలా ఎక్కువ. ఎవరిమీద ఆధారపడకూడదు అనే సిద్ధాంతం ఫాలో అవుతుంది. ఆ క్వాలిటీ ఎన్నడూ ఆమెను వదలలేదు. విడాకుల సమయంలో కూడా విమర్శలను లెక్కచేయదు. ఎంతటి సమస్య వచ్చినా మనోధైర్యం వీడలేదు. ఆటుపోట్లకు చలించదు. ప్రాణాంతకమైన మయోసైటిస్ వ్యాధిని ఎదిరించి దానిపై విజయం సాధించింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



