మన శంకర వరప్రసాద్ గారి బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్ పరిస్థితి ఏంటి మరి!
on Nov 3, 2025

-చిరంజీవి, వెంకటేష్ ఫ్యాన్స్ హంగామా
-మన శంకర వరప్రసాద్ గారు అప్ డేట్
-క్లైమాక్స్ షురూ
-త్వరలోనే భారీ ఎత్తున ప్రమోషన్స్
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)లో దాగి ఉన్న ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ కోణాన్ని మరోసారి సిల్వర్ స్క్రీన్ పై చూపించబోతున్న మూవీ 'మన శంకరవరప్రసాద్ గారు'(Mana Shankara Vara Prasad Garu). ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో, ప్రేక్షకులు అంతే ఇదిగా ఎదురుచూస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ చిత్రాల్లో కింగ్ అయిన మరో హీరో వెంకటేష్ కూడా సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. ఆల్రెడీ చిరంజీవి, వెంకటేష్(Venkatesh)పై సన్నివేశాలని కూడా చిత్రీకరించారు. సదరు సన్నివేశాలు అభిమానులని, ప్రేక్షకులని థియేటర్స్ లో నవ్వుల జడి వానలో ముంచడం ఖాయమనే టాక్ సినీ సర్కిల్స్ లో వినపడుతుంది. దీంతో 2026 వ సంవత్సరానికి మన శంకర వరప్రసాద్ గారు బిగ్గెస్ బ్లాక్ బస్టర్ గా నిలవడం ఖాయమని ఇద్దరు అభిమానులు నమ్ముతున్నారు. పైగా ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ చిత్రాలకి బాండ్ అంబాసిడర్ గా మారిన అనిల్ రావిపూడి(Anil Ravipudi)ఉండనే ఉన్నాడు.
ఇక ఈ చిత్రం ప్రకటించినప్పట్నుంచి శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది. ఈ మధ్య కాలంలో ఇంత ఫాస్ట్ గా షూటింగ్ ని జరుపుకుంటున్న మూవీ లేదని చెప్పవచ్చు. ప్రస్తుతం ముగింపు దశకి వచ్చేసింది. నిన్నటినుంచి హైదరాబాద్ లో వేసిన భారీ సెట్టింగ్ లో యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్నారు. చిరంజీవి రేంజ్ కి తగ్గట్టుగా సాగే ఈ భారీ యాక్షన్ ఎపిసోడ్ కి వెంకట్ మాస్టర్ స్టంట్స్ ని సమకూరుస్తున్నాడు. ఈ యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులని మెస్మరైజ్ చేస్తాయని యూనిట్ వర్గాలు చెప్తున్నాయి. ఇక ఈ న్యూస్ సోషల్ మీడియాలో వస్తుండటంతో క్లైమాక్స్ ఫైట్ చిరు ఒక్కడి మీదే చిత్రీకరిస్తున్నారా లేక వెంకటేష్ కూడా ఉంటాడా అనే ఆసక్తి అభిమానుల్లో ఏర్పడింది. ఫినిషింగ్ టచ్ ని ఎలా ఇవ్వబోతున్నారనే ఆసక్తి కూడా వాళ్లలో ఉంది.
Also Read: ఘనంగా జరిగిన అల్లు శిరీష్, నైనికా ఎంగేజ్మెంట్.. మెగా హైలెట్స్ ఇవే
సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'మనశంకరవరప్రసాద్ గారు' కి సంబంధించిన రిలీజ్ డేట్ త్వరలోనే రానుంది. ప్రమోషన్స్ కూడా అనిల్ రావిపూడి స్టైల్లో ఎవరు ఊహించని విధంగా ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే చిరంజీవి, నయనతార(Nayanthara)ల 'మీసాల పిల్ల సాంగ్' సృష్టిస్తున్న సంచలనం తెలిసిందే. మిగతా పాటలు కూడా త్వరలోనే విడుదల కానున్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమకి చెందిన ముఖ్య తారాగణం మొత్తం మన శంకర వరప్రసాద్ లో కనపడి కనువిందు చేయనుంది. చిరంజీవి కూతురు సుస్మిత తో కలిసి బాలయ్య తో భగవంత్ కేసరిని నిర్మించిన సాహు గారపాటి అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నాడు.
.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



