ఘనంగా జరిగిన అల్లు శిరీష్, నైనికా ఎంగేజ్మెంట్.. మెగా హైలెట్స్ ఇవే
on Nov 1, 2025

-అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్
-నైనికా ఎవరు
-మెగా ఫ్యామిలీ సందడి
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)సోదరుడు ప్రముఖ హీరో 'అల్లు శిరీష్'(Allu Sirish)కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు త్వరలోనే వివాహబంధంలోకి అడుగుపెడుతున్నానని తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు నైనికా అని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో నైనికా(Nayanika)ఎవరనే చర్చ అభిమానులతో పాటు నెటిజన్స్ లో జరిగింది.
రీసెంట్ గా అల్లు శిరీష్,నైనికా ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. శిరీష్ ఇంట్లో ఈ వేడుక జరగగా, ఇరు వైపుల పెద్దల సమక్షంలో కాబోయే వధూవరులు ఉంగరాలు మార్చుకున్నారు. నిశ్చితార్థ వేడుకలో అల్లు కుటుంబంతోపాటు మెగాస్టార్ చిరంజీవి(Chiramjeevi),నాగబాబు, రామ్ చరణ్(Ram Charan)వరుణ్ తేజ్ కూడా హాజరయ్యారు. సోషల్ మీడియాలో ఈ కార్యక్రమానికి సంబంధించిన పిక్స్ వైరల్ గా మారాయి. నిజానికి ఈ కార్యక్రమం అవుట్ డోర్ లో జరగాల్సింది. ఈ విషయంపై నిన్న శిరీష్ ఎక్స్ వేదికగా స్పందిస్తు చలికాలంలో అవుట్‌డోర్ నిశ్చితార్థం ప్లాన్ చేశాను. కానీ వాతావరణం, దేవుడికి వేరే ప్లాన్స్ ఉన్నాయ్’ అంటూ శిరీష్ ట్వీట్ చేసాడు.
Also read: నాని సినిమాలో హాలీవుడ్ అగ్ర హీరో!

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



