'NBK111' అప్డేట్ వాయిదా.. కారణం తెలుసా..?
on Nov 3, 2025

ఈరోజు రావాల్సిన నందమూరి బాలకృష్ణ 111వ సినిమా 'NBK111' అప్డేట్ వాయిదా పడింది. ఇది అభిమానులకు కాస్త నిరాశ కలిగించే విషయమే అయినప్పటికీ.. ఇలాంటి సమయంలో ఈ వాయిదా నిర్ణయం సరైనదే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
'వీరసింహారెడ్డి' తర్వాత నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని మరో సినిమా కోసం జత కట్టారు. ఈ హిస్టారికల్ యాక్షన్ డ్రామాను వృద్ధి సినిమాస్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇందులో నయనతార హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ-నయనతార కాంబినేషన్ లో గతంలో 'సింహా', 'శ్రీరామరాజ్యం', 'జైసింహా' వంటి విజయవంతమైన చిత్రాలు వచ్చాయి.

హిస్టారికల్ ఫిల్మ్ కావడంతో మా మహారాణిని సోమవారం(నవంబర్ 3) మధ్యాహ్నం 12:01 గంటలకు పరిచయం చేయబోతున్నామంటూ.. 'NBK111' టీమ్ ఆదివారం నాడు ప్రకటించింది.
అయితే ఈ తెల్లవారుజామున చేవెళ్ల సమీపంలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న ప్రమాదంలో 21 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు .
చేవెళ్లలో జరిగిన హృదయ విదారక సంఘటన దృష్ట్యా, ఈరోజు మధ్యాహ్నం 12:01 గంటలకు రావాల్సిన అప్డేట్ ని వాయిదా వేస్తున్నట్లు 'NBK111' టీమ్ ప్రకటించింది. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపింది.
Also Read: కుర్రకారును ఉర్రూతలూగించిన జ్యోతిలక్ష్మీ చివరి రోజులు ఎలా గడిచాయి?
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



