50 లక్షలు ఇవ్వకపోతే ఆ హీరోయిన్ ని చంపేస్తామంటున్నారు
on Mar 2, 2017

హీరోయిన్ భావన ఉదంతం మరిచిపోకముందే ఇంకో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. బాలీవుడ్ డైరెక్టర్ మహేష్ భట్ తనకు కొందరు ఆగంతకులు ఫోన్ చేసారని, తాము డిమాండ్ చేసిన 50 లక్షలు ఇవ్వకపోతే హీరోయిన్ అయిన తన కూతురు అలియా భట్ ని మరియు భార్య సోని రజ్దాన్ ని చంపేస్తామని బెదిరించారంట. ఈ విషయం ఆయన ట్విట్టర్ ద్వారా బయట పెట్టారు.
ఆలస్యం చేయకుండా, మహేష్ భట్ వెంటనే పోలీస్ కంప్లైంట్ చేసాడంట. పోలీసులు ఫోన్ కాల్స్ ని ట్రాక్ చేసి, ఒక దుండగుడిని పట్టుకొని విచారిస్తున్నారని తెలిసింది. ఈ కేసు ని ఛేదించిన మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్ పోలీసులకి మహేష్ భట్ ధన్యవాదాలు తెలిపారు. అయితే, 2014 లో ఈ బ్యాచ్ కి సంబంధించి భట్ ఫామిలీ ని చంపడానికి స్కెచ్ వేసిన 13 మందిని అరెస్ట్ చేసారు.
పాపులారిటీ ఎక్కువైన కొద్దీ, స్టార్స్ కి ప్రాణ భయం కూడా పెరుగుతూనే ఉంది. జాగ్రత్త గా ఉండడం మించి వాళ్ళు చేసేదేం లేదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



