పవన్‌కి నంది అవార్డు ఎందుకు ఇవ్వలేదు?
on Mar 2, 2017
నంది అవార్డుల ఎంపిక ఈసారి కాస్త వివాదాస్పదంగానే మారింది. మరీ ముఖ్యంగా 2013 ఉత్తమ నటుడిగా ప్రభాస్‌కి నంది అవార్డు ప్రకటించడం కొంతమంది సినీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరీ ముఖ్యంగా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఈ విషయంలో బాగా హర్ట్ అయినట్టు తెలుస్తోంది. 2013లోనే పవన్ కల్యాణ్ నటించిన అత్తారింటికి దారేది విడుదలైంది. మిర్చిలో ప్రభాస్ తో పోలిస్తే.. అత్తారింటికి దారేదిలో పవన్ కల్యాణ్ నటనే బాగుంటుందన్నది పవన్ అభిమానుల మాట.
మరీ ముఖ్యంగా క్లైమాక్స్ లో రైల్వే స్టేషన్ సీన్‌ని పవన్ కల్యాణ్ చించి అవతల పారేశాడని, అలాంటి సీన్ మిర్చిలో లేదన్నది పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మాట. పవన్‌కి నంది ఇవ్వకపోవడానికి రాజకీయ పరమైన కారణాలున్నాయన్నది విశ్లేషకులమాట. ఎంతకాదన్నా.. పవన్ టీడీపీ మనిషి. గత ఎన్నికల్లో పవన్ టీడీపీని గెలిపించేందుకు పాటు పడ్డాడు. రాష్ట్రం రెండుగా విడిపోయిన తరవాత.. నంది అవార్డులు ప్రకటించడం ఇదే తొలిసారి. ఇప్పుడు పవన్‌కి అవార్డు ఇస్తే... టీడీపీ మనిషి కాబట్టే పవన్‌కి నంది ఇచ్చారన్న విమర్శలు వినిపించే అవకాశం ఉంది. దానికి ఛాన్స్ ఇవ్వకుండా... కొంతమంది పొలిటికల్ పెద్దలు జోక్యం చేసుకొని, పవన్‌కి అవార్డు రాకుండా చేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.