ఇంతకీ ధనుష్ ఎవరి కొడుకు ?
on Mar 2, 2017

వెండితెరపై వైవిధ్యమైన పాత్రలు పోషించే తమిళ స్టార్, రజనీకాంత్ అల్లుడు ధనుష్ కు అంతే విచిత్రమైన సమస్య ఒకటి వచ్చింది. కదిరీశన్ అనే వ్యక్తి, ధనుష్ తన కుమారుడేనంటూ భార్యతో కలిసి కోర్టును ఆశ్రయించడం ఇప్పుడు కోలీవుడ్ లో చర్చనీయాంశమైయింది. జనరల్ గా ఇలాంటి సీన్లు సినిమాల్లో కనిపిస్తుంటాయి. అయితే ఇప్పుడు నిజ జీవితం,లో అదీ ఒక పాపులర్ హీరోకి ఇలాంటి సమస్య రావడం ఆసక్తికరమే.
ఇప్పుడు ఈ సమస్య కోర్టు చేరడంతో విషయం సీరియస్ గా మారింది. ఈ కేసులో ధనుష్ మద్రాసు హైకోర్టుకు కూడా హాజరయ్యాడు. ధనుష్ తల్లిదండ్రులు తామేనంటూ కదిరేసన్‌దంపతులు వేసిన పిటిషన్ పై స్పదించి కోర్టు ధనుష్ కు విచారణ కోసం రావాలని అదేశించిది . కోర్టు ఆదేశాలు మేరకు విచారణకు హాజరయ్యాడు ధనుష్.
ఈ కేసు విచారణలో .. ధనుష్ అసలుపేరు కలైయరసన్ అని,చిన్నప్పుడు చదువులో వెనకబడ్డాడని మేం మందలిస్తే ఆ కోపంతో ఇంట్లో నుండి పారిపోయాడని, ఇంట్లో నుండి వెళ్లిపోయేటప్పుడు తాను సినిమాల్లోకి వెళుతున్నాను అని ఉత్తరం రాశి పెట్టి పోయాడని అవసరమయితే డీఎన్‌ఎ టెస్ట్‌కు కూడా మేం సిద్దం అంటూ కదిరీశన్ దంపతులు జడ్జి ముందు మోర పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు.. ధనుష్ ను బర్త్ మార్క్స్ వెరిఫికేషన్‌కు పిలిచింది. వెరిఫికేషన్ లో బాగంగా పుట్టుమచ్చులు కూడా చూపించాడు ధనుష్. ఈ రోజు ఈ కేసులో తీర్పు రానుంది. మరి, కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో అన్న ఆసక్తినెలకొందిప్పుడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



