25న మహేష్ థియేటర్‌లో మహేష్ బొమ్మ!!
on Feb 23, 2019

మేడమ్ టుస్సాడ్స్ లో మహేష్ బాబు మైనపు బొమ్మను ఆవిష్కరించనున్న విషయం విదితమే. సింగపూర్ వారి ఆధ్వర్యంలో తయారైన మైనపు బొమ్మను ఈ నెల 25న హైదరాబాద్ లో ఏఎంబి సినిమా స్ మల్టీప్లెక్స్ లో మహేష్ బాబు ఆవిష్కరించనున్నారు. అయితే అభిమానులు, ప్రేక్షకుల సందర్శనార్థం ఒక రోజు హైదరాబాద్ లో ఆ ప్రతిమ ఉంచనున్నారు. అనంతరం సింగపూర్ కు తరలిస్తారు. అయితే అభిమానులతో పాటు తాను కూడా మైనపు బొమ్మ ను చూడాటికి ఇంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నానని మహేష్ బాబు తెలిపారు. మేడమ్ టుస్సాడ్స్ మైనపు ప్రతిమల మ్యూజియంలు వరల్డ్ వైడ్ గా నెలకొన్న విషయం తెలిసిందే. ఈ మ్యూజియంలో ప్రపంచ ప్రముఖుల మైనపు విగ్రహాలు కొలువుదీరుతాయి. అందులో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఆ రుదైన అవకాశం దక్కింది. హెయిర్ తో పాటు కళ్లు, కలర్ తో సహా ఒరిజినల్ గా మహేష్ బాబు ఉన్నట్టే ఆ ప్రతిమను రూపొందించారట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



