నటుడు మోహన్ బాబు ఇంట్లో చోరి!!
on Feb 23, 2019

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇంట్లో దొంగతనం జరిగిందట. ప్రజంట్ మోహన్ బాబు విదేశాల్లో ఉన్నారని తెలుస్తోంది. అయితే డబ్బుతో పాటు కొన్ని బంగారు ఆభరణాలు పోయినట్లు సమాచారం. ఈ విషయం పై మోహన్ బాబు మేనేజర్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారట. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఇంట్లో పని చేస్తోన్న వారి దగ్గర నుంచి డ్రైవర్లు , పని మనుషులను ప్రశ్నిస్తున్నారట పోలీసులు. ఇంత వరకు ఎవరు చేసారు ఏంటన్న దానిపై క్లారిటీ రానప్పటికీ కచ్చితంగా బాగా తెలిసిన వ్యక్తులే ఈ పని చేసుంటారని పోలీసులు అనుమానిస్తున్నారట. అందులో భాగంగానే అందర్నీ చారిస్తున్నట్లు తెలుస్తోంది. పోయిన బంగారం లక్షల్లో ఉంటుందట, నగదు కూడా భారీగానే పోయిందట. త్వరలో పోలీసులు వారిని పట్టుకుంటామని అంటున్నారు. ఇక వరుసగా సెలబ్రిటీల ఇంట్లో ఇటీవల కాలంలో దొంగతనాలు వరుసగా జరుగుతున్నాయి. టు ఇయర్స్ బ్యాక్ చింరజీవి ఇంట్లో కూడా రెండు లక్షల చోరీ జరిగిందట. మోహన్ బాబు ఇంట్లో కూడా గతంలో దొంగతనం జరిగినట్లు తెలుస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



