విదేశాలు వెళ్ళనున్న మహేష్-పరశురామ్
on Feb 24, 2020
ఒక విషయంలో స్పష్టత వచ్చింది... 'సరిలేరు నీకెవ్వరు' విజయం తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేయాలనుకున్నారు. ఇప్పుడు ఆ సినిమా కంటే ముందు పరశురామ్ దర్శకత్వంలో సినిమా చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. హీరోగా మహేష్ బాబు 27వ సినిమా పరశురామ్ దర్శకత్వంలో ఉంటుంది. ఇందులో మరో సందేహానికి తావులేదు. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే... ఈ సినిమా కోసం హీరో, డైరెక్టర్ ఇద్దరూ విదేశాలు వెళ్లనున్నారు. సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఫారెన్ లో ప్లాన్ చేసారని తెలిసింది.
'గీత గోవిందం' బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత స్టార్ హీరోలు ఎవరో ఒకరితో సినిమా చేయాలని దర్శకుడు పరుశురాం తీవ్ర ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగా మహేష్ బాబును ఆయన కలిశారు. కథ చెప్పారు. అయితే... అప్పట్లో ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఇప్పుడు... వంశీ పైడిపల్లి కథ సంతృప్తికరంగా అనిపించకపోవడంతో మహేష్ మరో ఆప్షన్ కోసం వెతికారు. గతంలో కథ చెప్పిన పరశురామ్ కు పిలుపు వెళ్ళింది. ఆల్రెడీ నాగచైతన్యతో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్న అతడు, అది పక్కన పెట్టి మరి మహేష్ బాబుతో సినిమా చేయడానికి సిద్ధమని చెప్పాడట. ఇంతకు ముందే కథ రెడీ చేయడంతో మిగతా నటీనటులు, టెక్నీషియన్స్ ను ఎంపిక చేసి షూటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. అయితే మార్చి లేదంటే మేలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.