రూ. 26 కోట్లతో జూబ్లీ హిల్స్‌లో స్థలం కొనుగోలు చేసిన మహేశ్!
on Dec 13, 2021

టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హైదరాబాద్‌లోని పాష్ ఏరియా అయిన జూబిలీ హిల్స్‌లోరూ. 26 కోట్లతో ఒక స్థలాన్ని కొనుగోలు చేశాడు. 1,442 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ఆ ప్లాట్‌ను యర్రం విక్రాంత్ రెడ్డి విక్రయించారు. ఆయన మునుపటి ఇంటిని కూల్చివేసి కొత్త బిల్డింగ్‌ను నిర్మించాలని ప్లాన్ చేశాడు. కానీ, మారిన పరిస్థితుల కారణంగా ప్లాట్లు విక్రయించాలని నిర్ణయించుకున్నట్లు డాక్యుమెంట్లని బట్టి తెలుస్తోంది.
మహేశ్, విక్రాంత్ రెడ్డి మధ్య సేల్ అగ్రిమెంట్ 2021 నవంబర్ 17న రిజిస్టర్ చేయబడింది. మహేష్ బాబు స్టాంప్ డ్యూటీ కింద రూ. 1.43 కోట్లు, ట్రాన్స్‌ఫర్ డ్యూటీ కింద రూ. 39 లక్షలు చెల్లించినట్లు డాక్యుమెంట్లు తెలిపాయి. ఈ విషయం ఆన్‌లైన్‌లో వైరల్ అయింది. అయితే దీనిపై మహేశ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ప్రస్తుతం ఆయన ఫిల్మ్‌నగర్‌లో విలాసవంతమైన సొంత భవనంలో నివాసం ఉంటున్నాడు.
జూబ్లీహిల్స్‌లోని ప్లాట్ సైజులు సాధారణంగా 1,000 చదరపు గజాల కంటే ఎక్కువగా ఉంటాయి. ఒక చదరపు గజం రూ. 1.5 లక్షల నుండి రూ. 2 లక్షలు అంతకంటే ఎక్కువ కూడా పలుకుతుందని బ్రోకర్లు చెప్పారు. నగరంలోని ప్రముఖులు అనేకమంది ఈ ప్రాంతంలో నివసిస్తుంటారు.
హైదరాబాద్‌లో ప్రాపర్టీ రేట్లు 2 నుండి 6 శాతం పెరిగాయి. మరిన్ని టెక్ కంపెనీలు, స్టార్టప్‌లు ఆఫీసుల్ని ఏర్పాటుచేయడం, లేదంటే వాటి లీజుల్ని పునరుద్ధరిస్తుండటంతో ఇళ్లకు మంచి డిమాండ్ ఉంది.
వర్క్ విషయానికి వస్తే మహేశ్ ప్రస్తుతం పరశురామ్ డైరెక్షన్‌లో 'సర్కారువారి పాట' చిత్రాన్ని చేస్తున్నాడు. దాని తర్వాత ఆయన త్రివిక్రమ్ డైరెక్షన్‌లో సినిమాని చేయనున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



